S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/03/2016 - 05:21

మహబూబ్‌నగర్, మే 2: ముఖ్యమంత్రి కెసిఆర్ హామీ మేరకు మహబూబ్‌నగర్ పట్టణంలో బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి పునాది పడింది. జిల్లా కలెక్టర్ టికె.శ్రీదేవి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ సోమవారం స్థానిక క్రిస్టియన్‌పల్లి సమీపంలోని ఆదర్శనగర్‌లో భూమిపూజ చేసి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

05/03/2016 - 05:20

హైదరాబాద్, మే 2: తెలంగాణలో ప్రాజెక్టు పనులను వైకాపా నేతలకు అప్పగించడంతో నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, వైఎస్‌ఆర్‌సిపి అధినేత జగన్‌ల నాటకం ప్రజల ముందు బట్టబయలైందని టిటిడిపి వర్గింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి విమర్శించారు.

05/03/2016 - 05:20

హైదరాబాద్, మే 2: తెలంగాణలోని అన్ని విద్యాసంస్థల్లో జూలై 31వ తేదీ నాటికి సిసి కెమేరాలు, బయోమెట్రిక్ అటెండెన్స్ పరికరాలను ఏర్పాటు చేస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు.

05/03/2016 - 04:46

ఖమ్మం, మే 2: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనున్నట్లు ప్రకటించారు. ఈ నెల 4న ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుతో పాటు ఖమ్మం జిల్లా వైకాపా కార్యవర్గమంతా టిఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు వెల్లడించారు.

05/03/2016 - 04:45

ఖమ్మం, మే 2: తెలంగాణలో ఇతర రాజకీయ పార్టీలకు భవిష్యత్ లేదని, త్వరలోనే వైసిపి తరహాలో టిడిపి నేతలంతా టిఆర్‌ఎస్‌లో చేరనున్నారని రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు. సోమవారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని టిఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించేందుకు ఖమ్మం వచ్చిన ఆయన విలేఖరులతో మాట్లాడారు.

05/02/2016 - 18:05

హైదరాబాద్: నగరంలోని ఎస్‌ఆర్ నగర్‌లో హనుమాన్ ఆలయం వద్ద సోమవారం ఉదయం ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును ఓ ఆగంతకుడు లాక్కునిపోయాడు. చైన్‌స్నాచర్‌తో పెనుగులాడిన ఆ మహిళ తీవ్రంగా గాయపడడంతో ఆమెను స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు.

05/02/2016 - 18:04

హైదరాబాద్: ఆరోగ్యశ్రీ పథకం కింద సేవలను పునరుద్ధరించేందుకు ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు అంగీకరించాయి. ప్రైవేటు ఆస్పత్రుల ప్రతినిధులకు, తెలంగాణ సర్కారుకు మధ్య సోమవారం జరిగిన చర్చలు సఫలమయ్యాయి. ఆరోగ్యశ్రీ బకాయిలను చెల్లించేందుకు ఇప్పటికే 117 కోట్లరూపాయలను విడుదల చేశామని చర్చల్లో పాల్గొన్న వైద్య,ఆరోగ్యశాఖా మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు.

05/02/2016 - 18:03

ఖమ్మం: ఆంధ్రావాళ్ల ప్రయోజనాల కోసమే జగన్ పోరాడుతున్నారని, తెలంగాణకు వ్యతిరేకంగా పలు నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఈ పరిణామాలు నచ్చకే తాను తెరాసలో చేరుతున్నట్లు ఖమ్మం వైకాపా ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

05/02/2016 - 16:53

ఖమ్మం: తెలంగాణ ప్రజల కోసం అంకితమైన తెరాస పార్టీలో చేరాలని ఖమ్మం వైకాపా ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని మంత్రి కెటిఆర్ ఆహ్వానించారు. ఆయన సోమవారం మధ్యాహ్నం పొంగులేటి ఇంటికి వెళ్లి మంతనాలు జరిపారు. రాజకీయ అస్థిత్వం కోసం తెరాసలో చేరడం మంచిదని ఆయన పొంగులేటికి సలహా ఇచ్చారు. ఎంపీ పొంగులేటి, ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు తెరాసలో చేరితే ఇక తెలంగాణలో వైకాపా అదృశ్యమైనట్లేనని కెటిఆర్ అన్నారు.

05/02/2016 - 16:53

హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ విషయమై కేంద్రంతో మాట్లాడేందుకు ఈనెల 10లోగా దిల్లీకి అఖిలపక్ష బృందాన్ని తీసుకువెళతామని మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. వర్గీకరణపై పార్లమెంటులో బిల్లు తేవాలని దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న ఎంఆర్‌పిఎస్ నాయకులతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. వర్గీకరణకు గతంలోనే తాము అసెంబ్లీలో తీర్మానం చేశామన్నారు.

Pages