S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/18/2016 - 18:16

హైదరాబాద్: నగరంలో సిఐడి ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న దయాకర్ రెడ్డిని సోమవారం పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. మాజీ ఎఎస్‌ఐ మోహన్‌రెడ్డి కేసులో విచారణాధికారిగా ఉన్న దయాకర్ రెడ్డి ఓ మహిళను వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి.

04/18/2016 - 18:14

కరీంనగర్: భారీగా వడ్డీ చెల్లిస్తానని పలువురి వద్ద అప్పులు చేసిన ఓ మహిళ బిచాణా ఎత్తేసిన సంఘటన గోదావరి ఖనిలో సోమవారం వెలుగు చూసింది. గోదావరి ఖనిలోని ఎల్‌బి నగర్‌లో ఉంటున్న శోభారాణి అధిక వడ్డీ ఇస్తానని చెప్పి పలువురి నుంచి 1.22 లక్షలు అప్పుగా తీసుకుంది. ఆదివారం రాత్రి నుంచి ఆమె కనిపించకుండా పోయిందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేస్తున్నారు.

04/18/2016 - 18:13

హైదరాబాద్: సిఎం కెసిఆర్‌కు నమ్మకం ఉన్నన్నాళ్లు తెలంగాణ క్యాబినెట్‌లో తాను కొనసాగుతానని, రాజ్యసభకు వెళ్లాలన్న ఆసక్తి తనకు లేదని హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి సోమవారం విలేఖరులకు చెప్పారు. కెసిఆర్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఇతర పార్టీల వారు తెరాసలో చేరుతున్నారని, తాము ఎవరిపైనా ఒత్తిడి తేవడం లేదన్నారు.

04/18/2016 - 18:12

హైదరాబాద్: హెచ్‌సియు వైస్ చాన్సలర్ అప్పారావును పదవి నుంచి తొలగించాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపి వి.హనుమంతరావు వేసిన పిటిషన్‌పై హైకోర్టు సోమవారం విచారణ ప్రారంభించింది. ఈ సందర్భంగా విచారణ సమయంలో జడ్జితో మాట్లాడేందుకు విహెచ్ యత్నించగా ధర్మాసనం ఆగ్రహణ వ్యక్తం చేసింది. బయటి వ్యక్తులు హెచ్‌సియు వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ఏమిటని కోర్టు ప్రశ్నించింది. కేసు విచారణను జూన్ 28కి వాయిదా వేసింది.

04/18/2016 - 16:33

హైదరాబాద్: తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులను ప్రత్యక్షంగా అధ్యయనం చేసేందుకు ఈనెల 23 నుంచి కరవుయాత్రలు చేపట్టాలని టి.టిడిపి నేతలు నిర్ణయించారు. ఇక్కడి ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో సోమవారం జరిగిన పార్టీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

04/18/2016 - 16:30

వరంగల్: గాలివాన బీభత్సం సృష్టించడంతో ఓ ఇంటిపైకప్పు కూలి గణేష్ అనే 13 ఏళ్ల బాలుడు మరణించాడు. స్టేషన్ ఘనపూర్ మండలం మల్కాపురంలో ఆదివారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది.

04/18/2016 - 05:24

హైదరాబాద్, ఏప్రిల్ 17: పౌర చైతన్య వేదిక ‘జాగృత భారత్’ చరిత్ర సృష్టించింది. దేశం కోసం పరితపించే దేశభక్తుల్ని జాగరూకుల్ని చేసి, దేశ ద్రోహులు, విదేశీ దుష్టశక్తుల ఆటకట్టేంచే లక్ష్యంతో నిర్వహించిన తొట్టతొలి సభనే విజయవంతంగా నిర్వహించి, అందరి ప్రశంసలూ చూరగొంది. అప్పటివరకూ మండుటెండ... సభ ప్రారంభమయ్యాక జోరువాన..అయినా సభికులు ఏ ఒక్కరు వెనుదిరిగితే ఒట్టు. వర్షంలోనే వక్తలు ప్రసంగించారు.

04/18/2016 - 05:12

హైదరాబాద్, ఏప్రిల్ 17: మధ్యాహ్నం రెండు గంటల వరకూ అదరగొట్టిన ఎండ...ఆ తర్వాత ఎటు పోయిందో ఏమో? అకస్మాత్తుగా వాతావరణం చల్లబడింది. చూస్తుండగానే సన్నటి చినుకులు మొదలై, భారీ వర్షంగా మారింది. అనుకోని ఈ హఠాత్పరిణామానికి రవ్వంత విస్తుపోయినా వర్షం తెచ్చిన ఆనందంతో నగరజీవి కేరింతలు కొట్టాడు. ఏదేమైతేనేం... నేల చల్లబడింది. రెండునెలలుగా మండుటెండల్లో మలమలమాడుతున్న నగరవాసుల మనసు కాస్తయినా కుదుటపడింది.

04/18/2016 - 05:07

హైదరాబాద్, ఏప్రిల్17: తెలంగాణ ఆవిర్భావం తరువాత తొలిసారిగా జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల్లో ఫలితాల గురించి ఎవరికీ అనుమానం లేకపోయినా అభ్యర్థులు ఎవరూ అనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రం నుంచి రెండు స్థానాల భర్తీకి వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో రెండు స్థానాల్లోనూ టిఆర్‌ఎస్ విజయం సాధించడం తథ్యం. అయితే ఆ రెండు సీట్లూ ఎవరికి దక్కుతాయనేదే ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

04/18/2016 - 05:05

హైదరాబాద్, ఏప్రిల్ 17: తెలంగాణ రాష్ట్రం చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో కరవుకోరల్లో చిక్కుకుంది. 443 మండలాల్లో కరవు వికటాట్టహాసం చేస్తోంది. కాని కేంద్రం నిర్దేశించిన మార్గదర్శకాలకు లోబడి రాష్ట్రం 231 మండలాలనే కరవు మండలాలుగా ప్రకటించడంతో మిగతా మండలాలు కరవు సహాయక చర్యలు నోచుకోక సతమతమవుతున్నాయి.

Pages