తెలంగాణ

రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మే 2: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనున్నట్లు ప్రకటించారు. ఈ నెల 4న ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుతో పాటు ఖమ్మం జిల్లా వైకాపా కార్యవర్గమంతా టిఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు వెల్లడించారు. సోమవారం ఖమ్మంలో జరిగిన ఆసక్తికర పరిణామాల మధ్య రాష్ట్ర మంత్రి కెటిఆర్ ఆహ్వానం మేరకు ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించారు. తొలుత ఉదయం స్థానిక ఎస్‌ఆర్ గార్డెన్స్‌లో వైకాపా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర నాయకులు ఆకుల మూర్తి, లింగాల కమల్‌రాజు, అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఇంచార్జ్‌లు, ఖమ్మం కార్పొరేటర్లు, ఎంపిపిలు, ఎంపిటిసిలు, సర్పంచ్‌లతో కలిపి రెండు వేల మంది హాజరయ్యారు. సమావేశంలో తొలుత పార్టీ మారాల్సిన ఆవశ్యకతపై పొంగులేటిని కొందరు నేతలు ప్రశ్నించారు. నేతలంతా పొంగులేటి నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, పార్టీ మారాల్సిన ఆవశ్యకతను ఆయన వివరించారు. అనంతరం మంత్రి కెటిఆర్‌తో సమావేశమయ్యారు. తరువాత పొంగులేటి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ తాను ఎంపి కాకముందే రాష్ట్ర విభజన జరిగిందని, అప్పటి నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో బలోపేతం చేసేందుకు ప్రయత్నించామన్నారు. సాధారణ ఎన్నికల్లో కూడా ఖమ్మం జిల్లాలో మంచి ఫలితాలు సాధించామన్నారు. తాను పార్టీలో చేరిన తర్వాత జిల్లాలో ఏ ఎన్నికలు జరిగినా పార్టీ ఉనికిని కాపాడుకుంటూ విజయాలు సాధించామన్నారు. ఈ క్రమంలో అనేక ఆరోపణలు ఎదురైనా వెనుదిరగలేదని స్పష్టం చేశారు. పార్టీని కాపాడుకునేందుకు భోజనం కూడా చేయకుండా ఒక్కడినే మథనపడిన రోజులున్నాయని, నేతలను ఇతర పార్టీల ప్రలోభాల నుంచి కాపాడుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశానని, అయినా కాపాడుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తనను కుటుంబ సభ్యునిలా చూశారన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే జగన్ ప్రయత్నిస్తున్నారని పొంగులేటి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం దీక్ష చేస్తున్న జగన్ తెలంగాణలో పార్టీ, ప్రజల పరిస్థితిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. జగన్‌కు ఇతరులను కించపరిచే మనస్తత్వం లేదని కూడా ఆయనన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, జరుగుతున్న అభివృద్ధికి తోడు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని కాపాడుకోలేని స్థితిలోనే తానీ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో అధికార టిఆర్‌ఎస్ మినహా మరే పార్టీ మిగిలే పరిస్థితి లేదని, దీనికి రాజకీయ ప్రలోభాలతో పాటు అనేక కారణాలు ఉన్నాయన్నారు.