S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/03/2016 - 16:42

హైదరాబాద్: వచ్చే నెల 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని సిఎం కెసిఆర్ అధికారును ఆదేశించారు. ఆవిర్భావ దినోత్సవం ఏర్పాట్లను ఆయన మంగళవారం సమీక్షించారు. నగరంలోని లుంబినీ పార్కులో లేజర్ షో జరిగే ప్రాంతంలో తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని భారీస్థాయిలో ఏర్పాటు చేయాలని ఆయన ఉత్తర్వులు జారీ చేశారు.

05/03/2016 - 16:41

హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోరైల్ ప్రాజెక్టు కొత్త ఎండిగా శివానంద నింబర్గే జూన్ 2న బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుత ఎండి విబి గాడ్గిల్ వచ్చేనెలలో పదవీ విరమణ చేస్తున్నందున శివానందను నియమించారు.

05/03/2016 - 16:35

హైదరాబాద్: జిహెచ్‌ఎంసి పరిధిలో పారిశుద్ధ్య విభాగం లారీ డ్రైవర్లు మంగళవారం మెరుపుసమ్మె ప్రారంభించారు. తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని, చెత్తలారీలను రాంకీ సంస్థకు అప్పగించరాదని, ప్రభుత్వ ఉద్యోగుల వలే అన్ని ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలని లారీ డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు.

05/03/2016 - 14:26

హైదరాబాద్: విడాకులు ఇవ్వకుండానే తన భర్త విజయ్ రెండోపెళ్లి చేసుకున్నాడని సినీనటి పూజిత మంగళవారం ఇక్కడ హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఎపి ప్రభుత్వంలో ‘శాప్’ ఎండిగా పనిచేస్తున్న రేఖారాణిని తన భర్త గత నెల 29న వివాహం చేసుకున్నట్లు ఆమె తెలిపారు. పదిహేనేళ్ల క్రితం తాను, విజయ్ పెళ్లి చేసుకున్నామని, తమకు ఒక కుమారుడు ఉన్నాడని ఆమె పేర్కొన్నారు.

05/03/2016 - 14:24

హైదరాబాద్: తెలంగాణలో నీటి ప్రాజెక్టుల్ని ఎపి నేతలు అడ్డుకుంటే తాము సహించేది లేదని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ మంగళవారం ఇక్కడ మీడియాతో అన్నారు. ఆంధ్రాలో రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రాజెక్టులపై వివాదాలను సృష్టించవద్దని, పద్ధతి ప్రకారం వెళదాం.. మేమూ సమస్యల్ని సృష్టించగలమని ఆయన తీవ్ర స్వరంతో అన్నారు. ఎపి సర్కారు చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టుకు అనుమతులున్నాయా? అని ఆయన ప్రశ్నించారు.

05/03/2016 - 14:24

దిల్లీ: తెలంగాణలో చేపట్టే సాగునీటి ప్రాజెక్టులపై ఎపి సిఎం చంద్రబాబు వైఖరి సరికాదని తెరాస ఎంపీలు విశే్వశ్వరరెడ్డి, సీతారాం నాయక్ మంగళవారం ఇక్కడ విమర్శించారు. న్యాయపరంగా తెలంగాణకు దక్కే నీటిని వాడుకునేందుకే కొత్త ప్రాజెక్టులను చేపడుతున్నట్లు వారు తెలిపారు. ఎపిలో చేపట్టే పోలవరం ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని అన్నారు.

05/03/2016 - 14:23

మెదక్: తాను వచ్చిన సమయానికి అధికారులు అందుబాటులో లేకపోవడంతో తెలంగాణ వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఆగ్రహంతో ఊగిపోతూ ముగ్గురు అధికారులు వెంటనే సస్పెండ్ చేయాలంటూ ఉన్నతాధికారులను ఫోన్‌లో ఆదేశించారు. చేగుంట మండలం నార్సింగిలో ‘మన తెలంగాణ-మన వ్యవసాయం’ కార్యకమానికి ఆయన ఆకస్మికంగా వచ్చారు. అక్కడ అధికారులెవరూ లేకపోవడంతో ఆయన ఆగ్రహం చెందారు.

05/03/2016 - 14:22

హైదరాబాద్: ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ, మిగతా పార్టీలను అణగదొక్కేందుకు యత్నిస్తున్న తెరాస పార్టీ రాజకీయాలను కలుషితం చేస్తోందని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆరోపించారు. కూకట్‌పల్లిలో మంగళవారం జరిగిన బిజెపి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో తెరాస విఫలమైందన్నారు. తెలంగాణ సర్కారు హామీలను తీర్చేవరకూ తాము పోరాడతామన్నారు.

05/03/2016 - 14:21

హైదరాబాద్: సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్, టిడిపి నాయకులు ఏనాడూ పొరుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టుల గురించి ప్రశ్నించలేదని, అయితే నేడు తెలంగాణ చేపడుతున్న నీటి పథకాలపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం సరికాదని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విమర్శించారు.

05/03/2016 - 11:57

కరీంనగర్: వేములవాడలోని రాజరాజేశ్వరి ఆలయ ప్రాంగణంలో మంగళవారం తెల్లవారుజామున నాలుగు నెలల బాలుడిని గుర్తుతెలియని మహిళ ఎత్తుకెళ్లింది. బాబును ఎత్తుకుని ఓ ఆగంతకురాలు వేగంగా నడుచుకుంటూ వెళుతున్నట్లు ఆలయం బయట సిసి కెమెరాలో రికార్డు అయింది. నల్గొండ జిల్లా బొందుగుల గ్రామానికి చెందిన కనకవ్వ, ఆమె కుటుంబ సభ్యులు రాజన్న సన్నిధికి సోమవారం వచ్చారు.

Pages