తెలంగాణ

మంత్రి ఆగ్రహం: ముగ్గురు అధికారుల సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్: తాను వచ్చిన సమయానికి అధికారులు అందుబాటులో లేకపోవడంతో తెలంగాణ వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఆగ్రహంతో ఊగిపోతూ ముగ్గురు అధికారులు వెంటనే సస్పెండ్ చేయాలంటూ ఉన్నతాధికారులను ఫోన్‌లో ఆదేశించారు. చేగుంట మండలం నార్సింగిలో ‘మన తెలంగాణ-మన వ్యవసాయం’ కార్యకమానికి ఆయన ఆకస్మికంగా వచ్చారు. అక్కడ అధికారులెవరూ లేకపోవడంతో ఆయన ఆగ్రహం చెందారు. తాను వచ్చిన కాసేపటికి అక్కడికి చేరుకున్న వ్యవసాయ అధికారిణి చైతన్య, వెటర్నరీ ఆఫీసర్ జీవన్‌ప్రతాప్‌లపై మంత్రి ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ ఇద్దర్నీ సస్పెండ్ చేయాలంటూ ఫోన్‌లో ఉన్నతాధికారులను ఆదేశించారు. గ్రామంలోని సహకార పరపతి సంఘం కార్యదర్శి నర్సింహులుపైనా మంత్రి ఆగ్రహం చెందారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉంటున్న నర్సింహులును సస్పెండ్ చేయాలంటూ సహకార శాఖ అధికారులకు మంత్రి హుకుం జారీ చేశారు.