తెలంగాణ

మా నీళ్లు వాడుకుంటే మీకేంటి బాధ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్, టిడిపి నాయకులు ఏనాడూ పొరుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టుల గురించి ప్రశ్నించలేదని, అయితే నేడు తెలంగాణ చేపడుతున్న నీటి పథకాలపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం సరికాదని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విమర్శించారు. ఆయన మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ, కృష్ణా-గోదావరి జలాల్లో 1300 టిఎంసీల నీటిని వాడుకునే హక్కు తెలంగాణకు ఉందని ఏనాడో జీవో ఇచ్చారని, ఆ ప్రకారమే ఇపుడు ప్రాజెక్టులకు సిఎం కెసిఆర్ శ్రీకారం చుట్టారన్నారు. మా ప్రాంతానికి దక్కే నీటిని మేం వాడుకుంటే మీ కెందుకు బాధ?- అని ఆయన కాంగ్రెస్,టిడిపి నేతలను ప్రశ్నించారు. ఎవరు అడ్డుపడినా తెలంగాణలో ప్రాజెక్టులను ఆపివేసే ప్రసక్తి లేదన్నారు.