తెలంగాణ

రాజన్న గుడిలో బాలుడి కిడ్నాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్: వేములవాడలోని రాజరాజేశ్వరి ఆలయ ప్రాంగణంలో మంగళవారం తెల్లవారుజామున నాలుగు నెలల బాలుడిని గుర్తుతెలియని మహిళ ఎత్తుకెళ్లింది. బాబును ఎత్తుకుని ఓ ఆగంతకురాలు వేగంగా నడుచుకుంటూ వెళుతున్నట్లు ఆలయం బయట సిసి కెమెరాలో రికార్డు అయింది. నల్గొండ జిల్లా బొందుగుల గ్రామానికి చెందిన కనకవ్వ, ఆమె కుటుంబ సభ్యులు రాజన్న సన్నిధికి సోమవారం వచ్చారు. స్వామిని దర్శించుకున్న అనంతరం సోమవారం రాత్రి వారంతా ఆలయ ప్రాంగణంలో నిద్రపోయారు. మంగళవారం తెల్లవారు జామున లేచిచూడగా బాలుడు కనిపించకుండా పోయాడని కనకవ్వ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుర్తుతెలియని మహిళ బాలుడిని అపహరించుకుపోయిందని సిసి ఫుటేజీ ద్వారా తెలుసుకుని పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.