తెలంగాణ

ఎంపీ పొంగులేటికి కెటిఆర్ ఆహ్వానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం: తెలంగాణ ప్రజల కోసం అంకితమైన తెరాస పార్టీలో చేరాలని ఖమ్మం వైకాపా ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని మంత్రి కెటిఆర్ ఆహ్వానించారు. ఆయన సోమవారం మధ్యాహ్నం పొంగులేటి ఇంటికి వెళ్లి మంతనాలు జరిపారు. రాజకీయ అస్థిత్వం కోసం తెరాసలో చేరడం మంచిదని ఆయన పొంగులేటికి సలహా ఇచ్చారు. ఎంపీ పొంగులేటి, ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు తెరాసలో చేరితే ఇక తెలంగాణలో వైకాపా అదృశ్యమైనట్లేనని కెటిఆర్ అన్నారు. ఆంధ్రా పార్టీలకు తెలంగాణలో మనుగడ ఉండదని, త్వరలో టిడిపికి కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుందని ఆయన జోస్యం చెప్పారు.