తెలంగాణ

ప్రైవేటు ఆస్పత్రులతో చర్చలు సఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆరోగ్యశ్రీ పథకం కింద సేవలను పునరుద్ధరించేందుకు ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు అంగీకరించాయి. ప్రైవేటు ఆస్పత్రుల ప్రతినిధులకు, తెలంగాణ సర్కారుకు మధ్య సోమవారం జరిగిన చర్చలు సఫలమయ్యాయి. ఆరోగ్యశ్రీ బకాయిలను చెల్లించేందుకు ఇప్పటికే 117 కోట్లరూపాయలను విడుదల చేశామని చర్చల్లో పాల్గొన్న వైద్య,ఆరోగ్యశాఖా మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. ఆరోగ్యశ్రీ నిబంధనల్లో కొన్ని మార్పులు చేసేందుకు కూడా ఆలోచిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. బకాయిలు విడుదల చేయడంతో ఇక ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభిస్తామని ప్రైవేటు ఆస్పత్రుల ప్రతినిధులు తెలిపారు.