S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/09/2015 - 06:46

హైదరాబాద్, డిసెంబర్ 8: ఆంధ్రప్రదేశ్‌లోని విద్యా సంస్ధల్లో చదువుతున్న ఆంధ్ర, తెలంగాణయేతర రాష్ట్రాల విద్యార్థులు తమ పూర్వ చరిత్రపై పోలీసు ధ్రువపత్రం సమర్పించాలని ఏపి ఉన్నత విద్యామండలి జారీ చేసిన సర్క్యులర్ చెల్లదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. కాలేజీ యాజమాన్యాలు విద్యార్ధుల పూర్వచరిత్రకు సంబంధించి పోలీసు ధ్రువపత్రం సమర్పించాలని ఏపి ఉన్నత విద్యా శాఖ ఇటీవల మార్గదర్శకాలను జారీ చేసింది.

12/09/2015 - 06:45

హైదరాబాద్, డిసెంబర్ 8: ఓ అంతర్రాష్ట వాహన దొంగల ముఠాను ఆటోమోబైల్ టీ, స్పెషల్ బ్రాంచ్, డికెక్టివ్ డిపార్టుమెంట్, సిసిఎస్ పోలీసులు పట్టుకున్నారు. వారిలో ఆరుగురిని అరెస్టు చేసి వారి నుంచి వివిధ కంపెనీలకు చెందిన 13్ఫర్ వీలర్ కార్లను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం క్రైమ్, సిట్ అదనపు కమిషనర్ స్వాతి లక్రా వాహన చోరుల వివరాలను వెల్లడించారు.

12/09/2015 - 06:39

హైదరాబాద్, డిసెంబర్ 8: రాజకీయ కక్ష సాధింపుల కోసమే తమ పార్టీ విజయవాడ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై కేసు పెట్టారని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టి.పిసిసి) అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి ఆరోపించారు. మద్యం తాగి మరణించిన ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించి బాధ్యులపై చర్య తీసుకోవాలని రఘువీరా రెడ్డి మంగళవారం పార్టీ నాయకులు డాక్టర్ ఎస్. శైలజానాథ్, డాక్టర్ ఎన్.

12/09/2015 - 06:38

హైదరాబాద్, డిసెంబర్ 8: గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టడానికి విచ్చలవిడిగా కల్తీమద్యం సరఫరా చేసి పలువురు ఓటర్ల ప్రాణాలను తీసిన నేతలు ఇపుడు ఏ మొహం పెట్టుకుని ఓదార్పుకు వచ్చారంటూ టిడిపి అధికార ప్రతినిధి వైవీబీ రాజేంద్రప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నాడు ఆయన ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు.

12/09/2015 - 06:37

హైదరాబాద్, డిసెంబర్ 8: ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని కాలేజీలనూ అక్రిడేట్ చేయాలని విద్యాశాఖ అధికారులను ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు మంగళవారం నాడు ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని ఉన్నత విద్యాసంస్థలు, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులతో సిఎం ముఖాముఖి కార్యక్రమాన్ని విజయవాడ నుండి నిర్వహించారు.

12/09/2015 - 06:36

హైదరాబాద్, డిసెంబర్ 8: ఐదు రాష్ట్రాల దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశాన్ని ఈ నెల 12వ తేదీన విజయవాడలో నిర్వహించనున్నా రు. సమావేశానికి సన్నద్ధతగా మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్ ప్రధానకార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశంలో చర్చించదగిన అంశాలను సిఎస్ కార్యదర్శులను అడిగి తెలుసుకున్నారు.

12/09/2015 - 06:35

హైదరాబాద్, డిసెంబర్ 8: పాఠశాలలకు కావల్సిన కనీస సౌకర్యాల కల్పన కోసం సర్వశిక్షా అభియాన్ నుండి విడుదల చేసిన నిర్వహణ గ్రాంట్, పాఠశాలల గ్రాంట్ 350 కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరిగి తమ ఖాతాలకు మళ్లించుకుంది.

12/09/2015 - 06:34

హైదరాబాద్, డిసెంబర్ 8: భారత్‌లో ఆంధ్రప్రదేశ్‌ను విద్యుత్ పొదుపు చేసే విధానాల అమలుకు ఆదర్శ రాష్ట్రంగా ఎంపిక చేసినట్లు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ డైరక్టెర్ జనరల్ డాక్టర్ అజయ్ మాథూర్ ప్రకటించారు. ఈ విషయాన్ని పారిస్‌లో భూతాపంపై జరుగుతున్న సదస్సులో ఇంధన పొదుపుపై జరిగిన సదస్సులో ఆయన వెల్లడించారు. ఈ వివరాలను అజయ్ మాథూర్ రాష్ట్ర ఇంధన కార్యదర్శి అజయ్ జైన్‌కు తెలియచేశారు.

12/09/2015 - 04:10

విజయవాడ, డిసెంబర్ 8: వైఎస్సార్సీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమల్లోకి తీసుకురాగలమని ప్రతిపక్షనేత వైఎస్ జగన్ ప్రకటించారు. మంగళవారం ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కల్తీ మద్యం బాధితులను, అలాగే మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.

12/09/2015 - 04:08

విజయవాడ, డిసెంబర్ 8: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం ఉదయ ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ నివాస గృహంలో జరిగే వివాహ కార్యక్రమంలో పాల్గొని రాత్రికి అక్కడే బస చేస్తారు. గురువారం ఉదయం బెంగుళూరుకు చేరుకుని అక్కడి నుంచి కుప్పంకు వెళతారు.

Pages