రాష్ట్రీయం

అంతర్రాష్ట దొంగల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 8: ఓ అంతర్రాష్ట వాహన దొంగల ముఠాను ఆటోమోబైల్ టీ, స్పెషల్ బ్రాంచ్, డికెక్టివ్ డిపార్టుమెంట్, సిసిఎస్ పోలీసులు పట్టుకున్నారు. వారిలో ఆరుగురిని అరెస్టు చేసి వారి నుంచి వివిధ కంపెనీలకు చెందిన 13్ఫర్ వీలర్ కార్లను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం క్రైమ్, సిట్ అదనపు కమిషనర్ స్వాతి లక్రా వాహన చోరుల వివరాలను వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా బ్రాహ్మణ పల్లికి చెందిన సంగెపు చక్రధర్, పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన పి శివ, ప్రకాశం జిల్లాకు చెందిన గుంజ రత్నకిషోర్, కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన కేతె శ్రీనివాస్‌రావు, మహరాష్టక్రు చెందిన విజయ్ నసీబ్‌చాంద్, తన్వీర్ కసమ్ భగవాన్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన నజీర్‌లు కలసి ఫోర్ వీలర్ దొంగతనాలకు పాల్పడుతున్నారు. చక్రధర్ దశవ్యాప్తంగా ఆర్టీఏ ఏజెంట్లతో సంబంధాలు పెట్టుకొని ప్రమాదాలకు గురైన ఫోర్ వీలర్ వాహనాల సమాచారాన్ని రాబట్టి అట్టి వాహనాల పార్ట్స్‌ను స్క్రాప్ కింద కొనుగోలు చేసేవాడు. అట్టి వాహనాలకు చెందిన ప్రధాన పార్ట్స్‌ను తొలగించి కొత్త వాహనాలుగా మార్చేవాడు. కాగా కొంత మందితో ఓ ముఠాగా ఏర్పడి ఫోర్‌వీలర్‌ను దొంగిలించడం, కొత్త వాహనాల పార్ట్స్‌ను దొంగిలించడం మొదలుపెట్టారు. ఆర్టీఏ అధికారులతో కలసి నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి అక్రమార్జనకు పాల్పడుతున్నారు. కాగా వీరిపై పలు వాహనాలు ఎత్తుకెళ్లినట్టు కేసులు నమోదయ్యాయి. ఈ ముఠాలోని సభ్యులు కొందరు అపహరించిన వాహనాలు తక్కువ ధరలకు విక్రయిస్తుండగా స్పెషల్ టీం, డికెక్టివ్ సిబ్బంది దొంగిలించిన వాహనాలు ఎక్కడ వెళ్తున్నాయి..ఎవరు కొనుగోలు చేస్తున్నారంటూ ఆరా తీశారు. వీరి ముఠా సభ్యులను పట్టుకొని విచారించగా బెంగుళూరు, విజయవాడ, మహరాష్ట్ర, హైదరాబాద్‌లలో పలు వాహనాలు దొంగిలించినట్టు అంగీకరించారు. ముఠాలోని ఆరుగురిని అరెస్టు చేసి వారి నుంచి వివిధ కంపెనీలకు చెందిన 13 ఫోర్ వీలర్ వాహనాలు స్వాధీనం చేసుకున్నట్టు అదనపు కమిషనర్ స్వాతిలక్రా తెలిపారు.