రాష్ట్రీయం

విద్యా విజ్ఞాన ఖనిగా ఆంధ్రప్రదేశ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 8: ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని కాలేజీలనూ అక్రిడేట్ చేయాలని విద్యాశాఖ అధికారులను ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు మంగళవారం నాడు ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని ఉన్నత విద్యాసంస్థలు, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులతో సిఎం ముఖాముఖి కార్యక్రమాన్ని విజయవాడ నుండి నిర్వహించారు.
మళ్లీ ఆంధ్రప్రదేశ్‌లో ఎంటర్‌ప్రెన్యూర్స్ హవా కొనసాగుతోందని సిఎం పేర్కొన్నారు. ప్రపంచంలో పది అత్యుత్తమ విశ్వవిద్యాలయాల నుండి నిపుణులను తీసుకువచ్చి, నైపుణ్య శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళల్లో నైపుణ్యాభివృద్ధికి కళాశాలల అధ్యాపకులతో త్వరలో శిక్షణా కార్యక్రమం చేపడతామని చెప్పారు. చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగం లేదా ఉపాధి కల్పించాలనేదే ప్రభుత్వ ఆశయమని అన్నారు. యువతలో నైపుణ్యాభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నామని, ఇంజనీరింగ్ కాలేజీల్లో సాయం త్రం వేళల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ తరగతులు నిర్వహించే యోచన ఉన్నట్టు సిఎం వెల్లడించారు. ఈ సందర్భంగా సిఎం అనేకమంది విద్యావేత్తలతో ఇంటరాక్ట్ అయ్యారు. ఉన్నత విద్యాసంస్థలతో కార్పొరేట్ సంస్థలు కలిసి పనిచేయడం దేశంలోనే తొలి ప్రయోగం అవుతుందని సిఎం పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను విద్యా విజ్ఞాన ఖనిలా తయారుచేయాలన్నదే తన సంకల్పమని సిఎం అన్నారు. ఉన్నత విద్యాశాఖ సిఎస్‌ఆర్ భాగస్వామ్యానికి 27 కార్పొరేట్ సంస్థలు ముందుకు వచ్చాయని చెప్పారు.