రాష్ట్రీయం

విద్యుత్ ఆదాలో ఏపి ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 8: భారత్‌లో ఆంధ్రప్రదేశ్‌ను విద్యుత్ పొదుపు చేసే విధానాల అమలుకు ఆదర్శ రాష్ట్రంగా ఎంపిక చేసినట్లు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ డైరక్టెర్ జనరల్ డాక్టర్ అజయ్ మాథూర్ ప్రకటించారు. ఈ విషయాన్ని పారిస్‌లో భూతాపంపై జరుగుతున్న సదస్సులో ఇంధన పొదుపుపై జరిగిన సదస్సులో ఆయన వెల్లడించారు. ఈ వివరాలను అజయ్ మాథూర్ రాష్ట్ర ఇంధన కార్యదర్శి అజయ్ జైన్‌కు తెలియచేశారు. భారత్‌లో 2019 నాటికి సాలీనా 19 వేల మెగావాట్ల విద్యుత్‌ను ఆదా చేయాలని కేంద్రం నిర్ణయించింది. వాతావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు, ఇంధన పొదుపు ఏకైక మార్గమని అజయ్ మాథూర్ తెలిపారు. పారిస్ సదస్సులో అంతర్జాతీయంగా ఇంధన పొదుపుపై జరిగిన చర్చలో ఆంధ్రప్రదేశ్‌లో ఎల్‌ఇడి బల్బుల అమర్చే విధానం, ఇంతవరుకు సాధించిన తీరును అంతర్జాతీయ విద్యుత్ నిపుణులు ప్రశంసించారు. దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యుత్ ఆదా కోసం ముందంజలో ఉండి విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తోందన్నారు. ఈ సదస్సులో పాల్గొన్న ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీస్ లిమిటెడ్ ఎండి సౌరభ్ కుమార్ మాట్లాడుతూ, ఆంధ్రాలో విద్యుత్ వినియోగదారులు, ఏపిఇఆర్‌సి మద్దతు విద్యుత్ ఆదా కార్యక్రమాలకు లభిస్తోందన్నారు. ఎల్‌ఇడి టెక్నాలజీ కార్యక్రమం పెద్ద ఎత్తున అమలు జరుగుతోందన్నారు. 2022 నాటికి 1.75 లక్షల మెగావాట్ల సంప్రదాయేతర ఇంధన వనరులను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఒక లక్ష మెగావాట్ల విద్యుత్ సౌర విద్యుత్ విభాగం నుంచి లభిస్తుందన్నారు.

ఇంధన పొదుపుపై జరిగిన సదస్సులో మాట్లాడుతున్న
బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ డైరక్టెర్ జనరల్ డాక్టర్ అజయ్ మాథూర్