రాష్ట్రీయం

మేమొస్తే సంపూర్ణ మద్య నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 8: వైఎస్సార్సీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమల్లోకి తీసుకురాగలమని ప్రతిపక్షనేత వైఎస్ జగన్ ప్రకటించారు. మంగళవారం ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కల్తీ మద్యం బాధితులను, అలాగే మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. మాల్స్‌లో కూడా మద్యం విక్రయించేలా సిఎం చంద్రబాబు నూతన విధానాన్ని రూపొందించారని, ఎలా విక్రయించినా నెలకు కనీసం వెయ్యి కోట్లుపైగా రాబడి రావాలనేది ఆయన ధ్యేయమంటూ నిప్పులు చెరిగారు. పేద, బడుగు, బలహీనవర్గాలకు మద్యంను దూరంగా ఉంచేలా తాను చర్యలు తీసుకోగలనని స్థితిపరులు స్టార్ హోటళ్లలో తప్పతాగి పడిపోయినా ఎవరికీ ఇబ్బంది ఉండదని అన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

చిత్రం.. మీడియాతో మాట్లాడుతున్న జగన్