S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/10/2015 - 07:22

హైదరాబాద్, డిసెంబర్ 9: ఆంధ్ర ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఏడాది సెలవులు ప్రకటించింది. 19 సాధారణ సెలవులు, 23 ఐచ్ఛిక సెలవులు, 14 ఎన్‌ఐ సెలవులను ప్రకటించింది.
సాధారణ సెలవులు

12/10/2015 - 07:12

హైదరాబాద్, డిసెంబర్ 9: ఒక వ్యక్తికి గుండెలో వంద శాతం మూసుకుపోయిన ధమనికి (క్రానిక్ టోటల్ అక్లూజన్) ‘క్రాస్ బాస్, స్ట్రింగ్‌రే’ పరికరాన్ని ఉపయోగించి హైదర్‌గుడాలోని అపోలో ఆసుపత్రి డాక్టర్లు విజయవంతంగా చికిత్స చేశారు. ఇలాంటి చికిత్స జరగడం దేశంలో ఇదే మొదటిసారని అపోలో డాక్టర్లు చెప్పారు. దీర్ఘకాలికంగా బాధపడుతున్న వ్యక్తికి తాము ఈ పద్ధతిలో విజయవంతంగా చికిత్స చేశామని కార్డియాలజిస్టులు డాక్టర్ వి.

12/10/2015 - 07:05

కడప,డిసెంబర్ 9: 79 మంది ఎర్రచందనం స్మగ్లర్లపై పిడి యాక్టు నమోదుచేసినట్లు రాయలసీమ జోన్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వివి.గోపాలకృష్ణ వెల్లడించారు. బుధవారం కడప జిల్లాలో పర్యటించిన ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఎర్రచందనం స్మగ్లింగ్‌తో ఎవరికి సంబంధాలున్నా ఉపేక్షించే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. స్మగ్లర్లు, కూలీలనూ వదిలే ప్రసక్తేలేదన్నారు.

12/10/2015 - 07:02

గుంటూరు, డిసెంబర్ 8: రాజధాని ప్రాంతమైన లింగాయపాలెంలో భూసమీకరణకు అంగీకార పత్రం ఇవ్వని 7.30 ఎకరాల్లో గల అరటి తోటను సిఆర్‌డిఎ ఆధ్వర్యంలోచదును చేయటంతో పొలం యజమానులు తుళ్లూరు పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశారు. గుండపు రాజేష్‌కుమార్, చంద్రశేఖర్, రమణమ్మలకు సంబంధించిన 139ఎ, 139ఎ3, 140,141 సర్వే నెంబర్‌లో ఏడు ఎకరాలా 30 సెంట్ల పొలం ఉంది. అందులో అరటి తోట వేసినట్లు రాజేష్‌కుమార్ తెలిపారు.

12/10/2015 - 07:02

నెల్లూరు, డిసెంబర్ 9: నెల్లూరుజిల్లాలో ఇటీవల సంభవించిన భారీ వరదల సందర్భంలో చోటుచేసుకున్న నష్టాలను కేంద్ర బృందం పరిశీలించింది. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి సత్యేంద్ర గార్గే నేతృత్వంలో ఈ బృందం బుధవారం ఉదయం పెళ్లకూరు, వాకాడు, తడ మండలాల్లో పర్యటించారు .

12/10/2015 - 06:58

తిరుచానూరు, డిసెంబర్ 9: శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండవరోజైన బుధవారం ఉదయం పెద్దశేష వాహన సేవ కన్నుల పండువగా జరిగింది. ఉదయం 8 గంటలకు అమ్మవారు పెద్ద శేషవాహనంలో వైకుంఠ నాథుడి అలంకరణలో భక్తులను అనుగ్రహించారు.

12/10/2015 - 06:57

హైదరాబాద్, డిసెంబర్ 9: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఈ నెల 17వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ఆరురోజుల పాటు జరగనున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు విమర్శలు, ప్రతి విమర్శలతో దాడికి సన్నద్ధమవుతున్నాయి. ఈ నెల 25వ తేదీ క్రిస్మస్ కంటే ముందు సమావేశాలు ముగుస్తాయి.

12/10/2015 - 06:54

కర్నూలు, డిసెంబర్ 9: సొంతింటి కల సాకారం కాగానే మంచి ముహూర్తం నిర్ణయించుకుని బంధుగణం సమక్షంలో గృహప్రవేశం చేస్తుంటారు. అయితే ఇకపై అలా కుదరదంటోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మీరు ఇంటి నిర్మాణం పూర్తిచేసుకున్నా గృహప్రవేశానికి తమ అనుమతి తప్పక తీసుకోవాలని అంటున్నారు. కొత్తింట్లో చేరడానికి ముందే ఆయా నగర పాలక, పురపాలక సంస్థ అధికారుల అనుమతి తీసుకోవాలి. లేదంటే భారీ జరిమానా తప్పదు.

12/10/2015 - 06:40

విజయవాడ, డిసెంబర్ 9: విజయవాడలో ఐదుగురిని బలి తీసుకున్న కల్తీ మద్యం కేసులో దర్యాప్తు చురుగ్గా కొనసాగుతున్నది.

12/10/2015 - 05:46

హిందూపురం, డిసెంబర్ 9: వరుస కరవు కాటకాలతో తల్లడిల్లుతున్న అనంతపురం జిల్లా పరిస్థితులను స్వయంగా పరిశీలించిన కేంద్ర కరవు బృందం నివ్వెరపోయింది. బుధవారం బెంగళూరు నుండి రోడ్డు మార్గాన అనంతపురం జిల్లా హిందూపురం చేరుకున్న కరవు బృందానికి ఆదిలోనే పరిస్థితులు కొట్టొచ్చినట్లు కనిపించాయి.

Pages