రాష్ట్రీయం

పంట నష్టంపై నివేదిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, డిసెంబర్ 9: నెల్లూరుజిల్లాలో ఇటీవల సంభవించిన భారీ వరదల సందర్భంలో చోటుచేసుకున్న నష్టాలను కేంద్ర బృందం పరిశీలించింది. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి సత్యేంద్ర గార్గే నేతృత్వంలో ఈ బృందం బుధవారం ఉదయం పెళ్లకూరు, వాకాడు, తడ మండలాల్లో పర్యటించారు . రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన వచ్చిన వీరు తొలుత పెళ్లకూరులో ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే రోడ్డు ధ్వంసమైన వైనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వరద నష్టాల పరిహారాల విజ్ఞప్తులపై వినతిపత్రాలను స్వీకరించారు. పెళ్లకూరు వద్ద వరదల వల్ల రెండు ఇళ్లు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన వైనంపై నివేదికల వివరాలను చూసి ప్రత్యేకంగా ఆరా తీశారు. ఆ రెండు ఇళ్ల కుటుంబాలను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన అధికారులు నష్టాలు ఎదురైన ప్రదేశాలను ప్రత్యేకంగా వారిని తీసుకెళ్లి చూపించారు. పెళ్లకూరు మండలలో స్వర్ణముఖి ఉప్పొంగిన ప్రవహించిన సందర్భంలో ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించారు. వివిధ శాఖల తరపున పెళ్లకూరు మండల తహశీల్దార్ కార్యాలయ సమీపంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను నిశితంగా తిలకించారు. కాళంగి నది ఉప్పొంగడం వల్ల సూళ్లూరుపేట పట్టణంలోని వట్రపాళెం ప్రాంతంలో విస్తృతంగా సందర్శించారు. అక్కడ దెబ్బతిన్న గృహాలు, పంటపొలాలు పరిశీలించారు. ఆ తరువాత గొల్లలములువుగ్రామంలో చెరువు, కాళంగి నది వల్ల కోతకు గురైన రోడ్లను పరిశీలించారు. వాకాడు మండలంలోనూ వరద నష్టాలను పరిశీలించారు. కోట మండలంలోని పుచ్చలపల్లి గ్రామం వద్ద ఇసుక మేట వేసి ఉన్న పొలాలు, గండ్లు పడి ఉన్న స్వర్ణముఖి నది, రహదారులు మరమ్మతులకు గురైన ప్రదేశాలను పరిశీలించారు. ఈ ఫిర్యాదు చేశారు. రీ సర్వే చేయాలని పట్టుబట్టారు. అలా చేయకుంటే ఆందోళన చేస్తామని కూడా హెచ్చరించారు. వారి వెంట హైవేస్ క్వాలిటీ రీజినల్ ఎస్‌ఇ ఏ కృష్ణప్రసాద్ , తిరుపతి ఎంపి వరప్రసాద్, జిల్లా కలెక్టర్ జానకి, జెసి ఇంతియాజ్, జలవనరులశాఖ ఎస్‌ఇ సుబ్బారావు తదితరులున్నారు.
తుపాను నష్టంపై కేంద్రానికి నివేదిక
శ్రీకాళహస్తి: ఇటీవల వచ్చిన తుఫాను సందర్భంగా జరిగిన నష్టాన్ని కేంద్రానికి నివేదిస్తామని కేంద్రకమిటీ సభ్యులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన తుఫాను నష్టం అంచనా బృందం బుధవారం ఉదయం చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం చిన్నకనపర్తి గ్రామం వద్ద గండి పడిన తెలుగుగంగ కాలువను పరిశీలించింది. గండి సందర్భంగా పొలాల్లో ఎపుడైనా ఇసుక మేటలను సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులతో కూడా మాట్లాడారు. కాలువకు గండి పడటం వల్ల తీవ్రంగా నష్టపోయామని 1996లో కూడా గండి పడి ఇసుకమేటలు వేయడం వల్ల ఇబ్బందులు పడ్డామని గుర్తుచేశారు. ప్రభుత్వమే ఇసుక మేటలను తొలగించాలని లేకుంటే ఆర్థిక సహాయం అందించాలని రైతులుకోరారు. దీనిపై నివేదికను తయారుచేసి కేంద్రప్రభుత్వానికి అందజేస్తామని సభ్యులు రైతులకు హామీ ఇచ్చారు. అంతేకాకుండా భారీ వర్షాల వల్ల శ్రీకాళహస్తి ప్రాంతంలో జిల్లాలో జరిగిన నష్టాల గురించి అటవీశాఖామంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కమిటీ సభ్యులకు వివరించారు. కేంద్రం ద్వారా ఇతోదిక సహాయం అందేవిధంగా చూడాలని సభ్యులను కోరారు. ఇదిలావుండగా రేణిగుంట విమానాశ్రయంలో కేంద్ర బృందానికి జిల్లా కలెక్టర్ సిద్దార్ధ జైన్ స్వాగతం పలికారు. అనంతరం అక్కడే విఐపి లాంజ్‌లో అరగంట సేపు వారితో పలు అంశాలను చర్చించారు. జిల్లాలో ఎక్కువ నష్టం సంభవించిన ప్రాంతాలను , ఆ విషయాలను కేంద్ర బృందానికి స్వయానా కలెక్టర్ వివరించారు.

నెల్లూరు జిల్లావాకాడు మండలంలో కేంద్ర పరిశీలకు పర్యటన
అనంతపురం జిల్లాలో వేరుశెనగ పంటను పరిశీలిస్తున్న కేంద్ర కరవు బృందం