రాష్ట్రీయం

రైతు అంగీకారం లేకుండా భూమిని చదును చేసిన సిఆర్‌డిఏ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 8: రాజధాని ప్రాంతమైన లింగాయపాలెంలో భూసమీకరణకు అంగీకార పత్రం ఇవ్వని 7.30 ఎకరాల్లో గల అరటి తోటను సిఆర్‌డిఎ ఆధ్వర్యంలోచదును చేయటంతో పొలం యజమానులు తుళ్లూరు పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశారు. గుండపు రాజేష్‌కుమార్, చంద్రశేఖర్, రమణమ్మలకు సంబంధించిన 139ఎ, 139ఎ3, 140,141 సర్వే నెంబర్‌లో ఏడు ఎకరాలా 30 సెంట్ల పొలం ఉంది. అందులో అరటి తోట వేసినట్లు రాజేష్‌కుమార్ తెలిపారు. పంట చేతికి వచ్చే సమయంలో సిఆర్‌డిఎ సిబ్బంది పర్యవేక్షణలోమంగళవారం రాత్రి ట్రాక్టర్లతో చదును చేయటంతో సుమారు 20 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందన్నారు. పూర్వీకుల నుంచి వారసత్వంగా వస్తున్న పొలాన్ని భూసమీకరణకు ఇవ్వటం ఇష్టంలేక వ్యవసాయం చేసుకుంటున్నామన్నారు. సిఆర్‌డిఎ అధికారులు కావాలని తమ పొలాన్ని చదును చేశారని ఆరోపించారు. తమకు జరిగిన నష్టం చెల్లించాలని డిమాండ్ చేశారు. పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసిన రాజేష్ కుటుంబ సభ్యులు నేరుగా సిఆర్‌డిఎ కార్యాలయం చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. సిఆర్‌డిఎ అధికారి చెన్నకేశవరావును కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని తెలియజేశారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు వేసిన శ్రీమన్నారాయణ బాధితులతో కలిసి సిఆర్‌డిఎ కార్యాలయం చేరుకున్నారు. పర్యావరణ అనుమతులు ఉన్నప్పటికీ భూములను దునే్న అనుమతి ప్రభుత్వానికి లేదన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం భూములు చదును చేస్తోందని ఆరోపించారు. ట్రిబ్యునల్‌లో వేసిన కేసు వాదోపవాదనలు జరిగిన తరువాత వాయిదా వేయటం జరిగిందన్నారు. పర్యావరణ అనుమతులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారన్నారు. అయితే వాదనలు విన్న ట్రిబ్యునల్ ఐదుగురితో కూడిన ధర్మాసనం వేసిందన్నారు.

సిఆర్‌డిఏ అధికారితో మాట్లాడుతున్న రైతు రాజేష్, శ్రీమన్నారాయణ