రాష్ట్రీయం

సభాపర్వానికి కౌంట్ డౌన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 9: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఈ నెల 17వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ఆరురోజుల పాటు జరగనున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు విమర్శలు, ప్రతి విమర్శలతో దాడికి సన్నద్ధమవుతున్నాయి. ఈ నెల 25వ తేదీ క్రిస్మస్ కంటే ముందు సమావేశాలు ముగుస్తాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా అంశంతోపాటు సంచలనం సృష్టించిన విజయవాడ కల్తీమద్యం, ఐదుగురు మృతిచెందిన సంఘటనను ప్రముఖంగా ప్రస్తావించి ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రతిపక్ష పార్టీ వైకాపా నిర్ణయించింది. ఈ ఘటన జరిగిన వెంటనే ప్రతిపక్ష పార్టీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడకు వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించడమే కాకుండా, తమ పార్టీ అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేస్తామని ప్రకటించిన విషయం విదితమే. ప్రస్తుతం వైకాపాలో ఉన్న మాజీ మంత్రి, పిసిసి మాజీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణను టార్గెట్ చేస్తూ మద్యం సిండికేట్ల అంశంతో ప్రతిపక్ష పార్టీని ఆత్మరక్షణలో పడేసేందుకు టిడిపి వ్యూహరచనలో నిమగ్నమైంది.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను సాధించడంలోజరుగుతున్న జాప్యం, అమరావతి శంకుస్ధాపన సభలో కూడా ప్రధానమంత్రి నరేంద్రమోదీ హోదాపై స్పష్టత ఇవ్వకపోవడం, రాష్ట్రంలో ఒక వైపు కరవు నెలకొని ఉండగా, మరో వైపు అతివృష్టితో నెల్లూరు, చిత్తూరు జిల్లాలు సతమతమవుతుంటే సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని వైకాపా ఆరోపిస్తోంది. బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇవ్వడంపై కూడా ప్రభుత్వాన్ని నిలదీయాలని వైకాపా నిర్ణయించింది. ఫీజు రీఎంబర్స్‌మెంట్, రైతుల రుణమాఫీ, డ్వాక్రా సంఘాల రుణమాఫీ అంశాలపై ప్రభుత్వాన్ని బోనులో నిలబెట్టాలని వైకాపా ఎత్తుగడలతో ఉంది. అసెంబ్లీ సమావేశాలకు ముందే పార్టీ పొలిట్‌బ్యూరో మీటింగ్‌తోపాటు టిడిఎల్‌పి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని టిడిపి నిర్ణయించింది. ప్రతిపక్ష పార్టీ అసెంబ్లీని ప్రతిష్టంభింపచేసి అడ్డుకుంటే తిప్పికొట్టాలని టిడిపి వ్యూహం రచిస్తోంది. అభివృద్ధి అజెండాగా తమ ప్రభుత్వం పని చేస్తోందంటూ వాడీవేడి ప్రసంగాలతో వైకాపాను నిలువరించే బాధ్యతను మంత్రి అచ్చెంనాయుడు, చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులుకు అప్పగించనున్నారు. ఈసారి వాకౌట్ చేయకుండా సభా సమయాన్ని వివిధ అంశాలపై సద్వినియోగం చేసుకుంటూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని ప్రతిపక్ష నేత జగన్‌కు పార్టీ ఎమ్మెల్యేలు సూచించినట్లు సమాచారం.