S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/09/2015 - 04:07

జంగారెడ్డిగూడెం, డిసెంబర్ 8: బహుళార్ధ సాధక ప్రాజెక్టు అయిన పోలవరాన్ని 2018 నాటికి పూర్తిచేసి తీరుతామని సిఎం చంద్రబాబు నాయుడు స్పష్టంచేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని మంగళవారం సందర్శించిన ముఖ్యమంత్రి హెడ్‌వర్క్స్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

12/09/2015 - 04:05

విజయవాడ, డిసెంబర్ 8: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విజయవాడ స్వర్ణబార్ అండ్ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న కల్తీమద్యం ఘటనపై పలు కోణాల్లో విచారణ తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కృష్ణలంక ప్రాంత ఎక్సైజ్ సిఐ వెంకటరమణను సస్పెండ్ చేసేందుకు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించారు. ప్రస్తుతం ఆయనను విధుల నుంచి తప్పించారు.

12/09/2015 - 04:03

విజయవాడ, డిసెంబర్ 8: గ్రామాల్లో మరుగుదొడ్లు, అంతర్గత రహదారులు, వ్యర్ధ పదార్ధాల నిర్వహణ, ఫాం పాండ్స్ ఏర్పాటుపై అన్ని శాఖలు కలిసి దృష్టి పెట్టాలని, ఈ కార్యక్రమాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమన్వయపరుచుకోవాలని సిఎం చంద్రబాబు ఆదేశించారు. ఎన్‌ఆర్‌ఇజిఎ నిధులను వినియోగించుకోవాలని సూచించారు.

12/08/2015 - 15:56

హైదరాబాద్ : నగరానికి మారిషస్ అధ్యక్షురాలు బీబీ అమీనా ఫిర్ దౌస్ గురిబ్ ఫాఖిమ్ చేరుకున్నారు. రెండు పర్యటన నిమిత్తం ఆమె ఇక్కడకు చేరుకున్నారు. టీఎస్ మంత్రి కేటీఆర్ తో పాటు పలువురు అధికారులు స్వాగతం పలికారు.

12/08/2015 - 14:07

విజయవాడ : విజయవాడలో స్వర్ణబార్‌లో కల్తీ మద్యం సేవించి ఐదుగురు మృతిచెందిన ఘటనకు సంబంధించి తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు. తొమ్మిదో నిందితుడిగా కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

12/08/2015 - 14:01

హైదరాబాద్‌ : గోల్కొండ హోటల్‌లో గ్రేటర్‌ హైదరాబాద్‌ కాంగ్రెస్‌ నేతలు సమావేశమై జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై చర్చించారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేతలు భట్టి విక్రమార్క, దానం నాగేందర్‌, మర్రి శశిధర్‌రెడ్డి తదితరులు సమావేశానికి హాజరయ్యారు.

12/08/2015 - 06:54

కరవుపై కేంద్ర బృందం సభ్యుల విస్మయం.. సాయం అందేలా చూస్తామని భరోసా

12/08/2015 - 06:53

తిరుపతి, డిసెంబర్ 7: గోవును నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువుగా ప్రకటించాలని బిజెపి ఒబిసి మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జల్లి మధుసూదన్ డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, గోవును మాతగా గౌరవించడం, పూజించడం మన సాంప్రదాయమన్నారు. కుల, మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు గోవును గౌరవిస్తారన్నారు.

12/08/2015 - 06:53

వరంగల్, డిసెంబర్ 7: రాష్ట్రంలోని పత్తి రైతులకు వచ్చే ఏడాది నుండి గిట్టుబాటు ధర పెంపు విషయం కేంద్రం ఆలోచిస్తుందని కేంద్ర జౌళి శాఖ అదనపు కార్యదర్శి పుష్పసుబ్రహ్మణ్యం అన్నారు. రైతు సమస్యలు తెలుసుకునేందుకు సోమవారం వరంగల్ వ్యవసాయ మార్కెట్‌కు వచ్చిన ఆమె ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడారు. ఈ ఏడాదిలో గిట్టుబాటు ధర ఉండబోదని స్పష్టం చేశారు.

12/08/2015 - 06:52

షాద్‌నగర్, డిసెంబర్ 7: నకిలీ గుట్కాలను తయారు చేసే పరిశ్రమపై మహబూబ్‌నగర్‌కు చెందిన స్పెషల్ పోలీసులు ఆదివారం అర్ధరాత్రి దాడి జరిపి 60 లక్షల రూపాయల విలువగల గుట్కాలతో పాటు ముడిసరుకును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Pages