రాష్ట్రీయం

విద్యామండలి సర్క్యులర్ చెల్లదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 8: ఆంధ్రప్రదేశ్‌లోని విద్యా సంస్ధల్లో చదువుతున్న ఆంధ్ర, తెలంగాణయేతర రాష్ట్రాల విద్యార్థులు తమ పూర్వ చరిత్రపై పోలీసు ధ్రువపత్రం సమర్పించాలని ఏపి ఉన్నత విద్యామండలి జారీ చేసిన సర్క్యులర్ చెల్లదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. కాలేజీ యాజమాన్యాలు విద్యార్ధుల పూర్వచరిత్రకు సంబంధించి పోలీసు ధ్రువపత్రం సమర్పించాలని ఏపి ఉన్నత విద్యా శాఖ ఇటీవల మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ ధ్రువపత్రం సమర్పించని విద్యార్ధులు ఐదు వేల రూపాయల జరిమానా చెల్లించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఏపి ఉన్నత విద్యా శాఖ జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ నందిని, మరో 14 మంది లా విద్యార్ధులు, డాక్టర్ అంబేద్కర్ గ్లోబల్ లా ఇనిస్టిట్యూట్‌తో పాటు నాలుగు విద్యా సంస్ధలు పిటిషన్లను హైకోర్టులో దాఖలు చేశారు. రాష్ట్ర భద్రతను దృష్టిలో ఉంచుకుని, ఆంధ్ర, తెలంగాణయేతర విద్యార్ధులు పోలీసుల ధృవపత్రం, వోటర్ కార్డు, ఆదార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సుల ప్రతులను దఖలు పరచాలని ఉన్నత విద్యామండలి మార్గదర్శకాల్లో పేర్కొంది. ఉన్నత విద్యామండలి ఇచ్చిన మార్గదర్శకాలు లా కాలేజీలకే కాకుండా అన్ని వృత్తి కాలేజీలకు వర్తిస్తుందని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ కేసును హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పివి సంజయ్ కుమార్ విచారించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లా కాలేజీల్లో ప్రవేశం జాతీయ ప్రాతిపదికన ఉంటుందని, దేశంలో ఎక్కడి చదివిన వారైన లా కాలేజీల్లో చేరవచ్చని హైకోర్టు పేర్కొంది. ఉన్నత విద్యామండలి జారీ చేసిన సర్క్యూలర్ చెల్లదని తీర్పులో పేర్కొన్నారు.