రాష్ట్రీయం

12న ఐదు రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 8: ఐదు రాష్ట్రాల దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశాన్ని ఈ నెల 12వ తేదీన విజయవాడలో నిర్వహించనున్నా రు. సమావేశానికి సన్నద్ధతగా మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్ ప్రధానకార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశంలో చర్చించదగిన అంశాలను సిఎస్ కార్యదర్శులను అడిగి తెలుసుకున్నారు. పేదరిక నిర్మూలన, పర్యావరణం, గ్రామీణాభివృద్ధి, రోడ్లు-రవాణా, గృహనిర్మాణం, రైల్వే, విద్యుత్ పంపిణీ, పరిశ్రమల కారిడార్లు, జిఎస్‌టి-టూరిజం తదితర అంశాలను జోనల్ కౌన్సిల్ సమావేశంలో చర్చించేందుకు వీలుగా సన్నద్ధంగా ఉండాలని కార్యదర్శులకు సిస్ సూచించారు. జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, కర్నాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలతో పాటు పాండిచ్చేరి ప్రతినిధులు పాల్గొంటారు. ఒకరికొకరు పరస్పరం సహకరించుకుంటూ అభివృద్ధిలో ముందుకు సాగేందుకు , రాష్ట్రాలను ప్రోత్సహించేందుకు కేంద్రం ఈ తరహా సమావేశాలను నిర్వహిస్తోంది. సమావేశాలను సక్రమంగా నిర్వహించేందుకు స్టాండింగ్ కమిటీ ఏర్పాటైంది. స్టాండింగ్ కమిటీలో జోనల్ పరిధిలోని రాష్ట్రాల ప్రధానకార్యదర్శులు అంతా సభ్యులుగా ఉన్నారు.

ఆగమ సలహా మండలి
కొత్త చైర్మన్‌గా సిఎస్‌ఆర్ శర్మ

హైదరాబాద్, డిసెంబర్ 8: ఆంధ్రప్రదేశ్ ఆగమ సలహా మండలి చైర్మన్‌గా కృష్ణయజుర్వేద పండితుడు చిర్రావూరి శ్రీ రామ శర్మను నియమించారు. ఆయనతో పాటు సంస్కృ త పండితుడు, రాజమండ్రి ఓరియంటల్ కాలేజీ ప్రిన్సిపాల్ విశ్వనాధ గోపాలకృష్ణ శాస్ర్తీని , వైఖానస నిపుణుడు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం (మంగళగిరి) ఉప ప్రధా న అర్చకుడు నల్లూరి రామచంద్ర భట్టాచార్యులు, పంచతంత్ర నిపుణుడు మోర్తా సీతారామాచార్యులు, శైవ నిపుణుడు శ్రీకాళహస్తి దేవాలయం ప్రధాన అర్చకుడు ఎస్‌ఎంకె సదాశివ, వీర శైవ నిపుణుడు రేవన్న సిద్ధాంతి, వైదిక స్మార్త నిపుణుడు జగన్నాధ శాస్ర్తీ, శ్రీ వైష్ణవ నిపుణుడు చిలకపాటి తిరుమలాచారి, తాంత్రసార నిపుణుడు రాజా ఎస్ గిరి ఆచార్య, గ్రామ దేవత నిపుణుడు రాఘవయ్య, జ్యోతిష్య నిపుణుడు ఎల్ సుబ్రహ్మణ్య సిద్ధాంతి సభ్యులుగా ఉంటారు. అర్చక పరీక్షలకు ప్రధానంగా ప్రవర, వీర, ప్రవేశ స్థాయి పరీక్షల సిలబస్‌ను పరిశీలించడం, పరీక్షల సంస్కరణలు చేపడతారు. వివిధ దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు వృత్యంతర శిక్షణ , దైవాంశాల్లో, ధర్మాంశాల్లో ప్రభుత్వానికి ఎప్పటికపుడు సలహాలు ఇవ్వడం తదితర బాధ్యతలను ఈ బోర్డు చేస్తుంది. బోర్డు సభ్యుల కాలపరిమితి ఐదేళ్లు ఉంటుంది.
నూజివీడు ట్రిపుల్ ఐటిలో ఎపిహెచ్‌ఆర్‌డి
ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి సంస్థను నూజివీడు ట్రిపుల్ ఐటిలో ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. శాశ్వత ప్రాంగణం ఏర్పాటయ్యేంత వరకూ తాత్కాలికంగా ట్రిపుల్ ఐటిలో ఎపిహెచ్‌ఆర్‌డి కొనసాగుతుంది.