రాష్ట్రీయం

కక్ష సాధించేందుకే మల్లాది విష్ణుపై కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 8: రాజకీయ కక్ష సాధింపుల కోసమే తమ పార్టీ విజయవాడ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై కేసు పెట్టారని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టి.పిసిసి) అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి ఆరోపించారు. మద్యం తాగి మరణించిన ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించి బాధ్యులపై చర్య తీసుకోవాలని రఘువీరా రెడ్డి మంగళవారం పార్టీ నాయకులు డాక్టర్ ఎస్. శైలజానాథ్, డాక్టర్ ఎన్. తులసిరెడ్డి, గౌతమ్, రవిచంద్‌లతో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడ మద్యం కేసుపై సమగ్రంగా విచారణ జరిపించాలని, ఈ బార్ నుంచి సేకరించిన నమూనాలను రెండు మూడు ల్యాబ్‌లకు పంపించాలని రఘువీరా రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సంఘటన జరిగిన తర్వాత 7 బ్రాండ్లకు సంబంధించిన మద్యం విక్రయాలను నిలిపి వేయడం వెనుక ఉన్న మతలబు ఏమిటని ఆయన ప్రశ్నించారు. సంఘటన జరిగిన వెంటనే బాధితులను ఆసుపత్రికి పంపించే పనుల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు నిమగ్నం కాకుండా రాజకీయ లబ్ధి పొందేందుకు విమర్శలు చేయడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. లైసెన్సులు, బార్ నిర్వహణలో ఏ మాత్రం ప్రమేయం లేని విష్ణుపై కేసులు పెట్టడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అవినీతిపై విచారణ జరిపించండి
పదేళ్ళ కాంగ్రెస్ పాలనపై సమగ్రమైన విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నించగా, తమ ప్రభుత్వ పాలనపైనే కాకుండా, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పథకాలపైనా విచారణ జరిపించి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విచారణకు తాము పూర్తిగా సహకరిస్తామని అన్నారు. బాబుకు చిత్తశుద్ధి ఉంటే గతంలో టిడిపి అధికారంలో ఉన్న తొమ్మిదేళ్ళ పాలనపైనా విచారణకు సిద్ధం కావాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు.