రాష్ట్రీయం

ఏ మొహం పెట్టుకుని ఓదారుస్తారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 8: గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టడానికి విచ్చలవిడిగా కల్తీమద్యం సరఫరా చేసి పలువురు ఓటర్ల ప్రాణాలను తీసిన నేతలు ఇపుడు ఏ మొహం పెట్టుకుని ఓదార్పుకు వచ్చారంటూ టిడిపి అధికార ప్రతినిధి వైవీబీ రాజేంద్రప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నాడు ఆయన ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. బొత్స సత్యనారాయణకు పార్టీలో పెద్ద పీట వేసి నెత్తిమీద పెట్టుకున్న జగన్మోహన్‌రెడ్డి ఇపుడు ఓదార్పు నాటకం ఆడటం హాస్యాస్పదమని అన్నారు. అధికారపతనం తర్వాత కూడా కాంగ్రెస్ నేతలు తమ దుర్మార్గాలను కొనసాగిస్తున్నారని రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. ఎక్సైజ్ మంత్రిని రాజీనామా చేయమని కోరడం దారుణమని అన్నారు. విజయనగరంలో మజ్జి చిన్నారావు, నెల్లూరులో భద్రయ్య వైకాపా కల్తీమద్యం సేవించి ప్రాణాలు పొగొట్టుకుంటే వారి కుటుంబాలను ఆదుకునే దిక్కులేదని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర నిబద్ధత ఉన్న వ్యక్తి అని, ఆయన రాజీనామా చేస్తే పరిష్కారం అవుతుందా అని ప్రశ్నించారు. చంద్రబాబుపైన నిష్కారణంగా నిందలు వేయడానికి ప్రయత్నించవద్దని పేర్కొన్నారు.

పండిట్ ట్రైనింగ్ పరీక్ష ఫలితాలు విడుదల

హైదరాబాద్, డిసెంబర్ 8: తెలంగాణ పండిట్ ట్రైనింగ్ కోర్సు ఫలితాలను తెలంగాణ పరీక్షల బోర్డు విడుదల చేసింది. మొత్తం 3165 మంది పరీక్షలకు హాజరుకాగా, వారిలో 98.18 శాతం ఉత్తీర్ణులయ్యారు. అభ్యర్ధుల మార్కుల జాబితాలను బిఎస్‌ఇ డాట్ తెలంగాణ డాట్ ఆర్గ్ అనే వెబ్ సైట్‌లో ఉంచినట్టు పరీక్షల బోర్డు అధికారులు తెలిపారు. రీకౌంటింగ్ కు దరఖాస్తు చేసుకునే వారు 500 రూపాయిలను ఎస్‌బిహెచ్ చలానా తీసి 23వ తేదీలోగా దానిని పరీక్షల బోర్డులో సమర్పించాలని సూచించారు.

నేడు, రేపు కేంద్ర
బృందాల పర్యటన

విజయవాడ, డిసెంబర్ 8: రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, పలు జిల్లాల్లో నెలకొన్న కరవు పరిస్థితుల వల్ల ఏర్పడిన అపార వర్షాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం పంపిన నివేదిక ఆధారంగా వాస్తవిక పరిస్థితులను అధ్యయనం చేసేందుకు గాను కేంద్ర బృందాలు ఈ నెల 9,10 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి అధికారులు సత్యేంద్ర గార్గ్, షకీల్ అహ్మద్ నేతృత్వంలోని బృందాలు పర్యటించి ఢిల్లీకి తిరిగి వెళ్లేముందు 11వ తేదీ ముఖ్యమంత్రితో ఈ బృందాలు విడివిడిగా సమావేశమై తమ నివేదికలు అందజేయనున్నాయి. కరవుపై షకీల్ అహ్మద్ బృందం అనంతపురం, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లోను, భారీ వర్షాలపై సత్యేంద్ర గార్గ్ బృందం అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు, కృష్ణా, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పర్యటించబోతున్నాయి.
ఇప్పటికే క్షేత్రస్థాయిలో రూ.3759 కోట్ల మేర నష్టం అంచనావేసి కేంద్రానికి పంపామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. రెండు లక్షల 6వేల హెక్టార్ల వరిసాగులో రూ.426 కోట్లు, ఉద్యానవనాల్లో రూ.335 కోట్లు, ఆక్వా రంగంలో రూ.492 కోట్లు, పంచాయతీరాజ్ విభాగంలో రూ.559 కోట్లు, ఆర్ అండ్ బి పరిధిలో రూ.711 కోట్లు, నీటిపారుదలశాఖ పరిధిలో రూ.800 కోట్లు పైగా నష్టాలు జరిగినట్లు అంచనాలు వేసి కేంద్రానికి పంపించటం జరిగిందన్నారు.