S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/30/2016 - 07:51

ముంబయి, మే 29: ఇంటిపేరు మారినంతమాత్రాన ఒక వ్యక్తి కులం మారిపోదని బొంబాయి హైకోర్టు స్పష్టం చేసింది. ఇంటిపేరు మార్చుకున్నాడన్న కారణంగా సరయిన కుల సర్ట్ఫికెట్ ఉన్నప్పటికీ ఎస్టీ కోటా కింద పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులో అడ్మిషన్ నిరాకరించిన ఒక వైద్య విద్యార్థికి ఈ తీర్పుతో ఊరట లభించింది.

05/30/2016 - 07:50

న్యూఢిల్లీ, మే 29: సామాన్య ప్రజలకు చేరువలో ఉండే విధంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కార్యాలయ (పిఎంఓ) అధికారిక వెబ్‌సైట్‌ను ప్రాంతీయ భాషల్లోకి విస్తరించి మరో ఆరు భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రారంభించిన ఈ వెబ్‌సైట్లు ఇప్పుడు తెలుగుతోపాటు తమిళ, మలయాళ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ భాషల్లో కూడా అందుబాటులోకి వచ్చాయి.

05/30/2016 - 07:50

న్యూఢిల్లీ, మే 29: సామాన్య ప్రజలకు చేరువలో ఉండే విధంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కార్యాలయ (పిఎంఓ) అధికారిక వెబ్‌సైట్‌ను ప్రాంతీయ భాషల్లోకి విస్తరించి మరో ఆరు భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రారంభించిన ఈ వెబ్‌సైట్లు ఇప్పుడు తెలుగుతోపాటు తమిళ, మలయాళ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ భాషల్లో కూడా అందుబాటులోకి వచ్చాయి.

05/30/2016 - 07:48

న్యూఢిల్లీ, మే 29: రక్షణ రంగ సామగ్రిని సరఫరా చేయడానికి ఇటలీకి చెందిన ఫిన్‌మెకానికా, దాని అనుబంధ సంస్థలు దక్కించుకున్న ప్రస్తుత టెండర్లన్నింటినీ రద్దు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఫిన్‌మెకానికాను బ్లాక్ లిస్టులో పెట్టడానికి ముందస్తు చర్యగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

05/30/2016 - 07:45

న్యూఢిల్లీ, మే 29: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జూన్ నాలుగో తేదీ నుంచి అయిదు దేశాల పర్యటన చేయనున్నారు. అఫ్గానిస్థాన్, ఖతార్, స్విట్జర్లాండ్, అమెరికా, మెక్సికోలలో మోదీ పర్యటిస్తారు. భారత నిధులతో (రూ.1400కోట్లు) నిర్మించిన సల్మా డ్యాంను అఫ్గాన్‌లో ఆయన ప్రారంభిస్తారు. ఖతార్‌లో రెండురోజుల పర్యటన సందర్భంగా అక్కడి రాజు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో విస్తృతంగా చర్చలు జరపనున్నారు.

05/30/2016 - 07:43

న్యూఢిల్లీ, మే 29: ఆఫ్రికన్ జాతీయులపై జరుగుతున్న వరుస దాడులు, కాంగో మహిళ మృతి ఘటనలపై కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలకు ఉపక్రమించింది. దాడులకు కారకులైన వారిని ఉపేక్షించవద్దని, తక్షణం చర్యలు తీసుకోవాలని హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఢిల్లీ పోలీస్ కమిషనర్, లెఫ్టినెంట్ గవర్నర్‌లను ఆదేశించారు. ఆఫ్రికన్ జాతీయులు నివసిస్తున్న ప్రాంతాల్లో పెట్రోలింగ్ పెంచాలని కూడా ఆదేశించారు.

05/30/2016 - 07:29

బెంగళూరు, మే 29: తొమ్మిదో ఐపిఎల్ ఫైనల్‌లో పటిష్టమైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. చిన్నస్వామి స్టేడియంలో చివరి వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన తుది పోరులో విరాట్ కోహ్లీ నాయకత్వంలోని బెంగళూరును ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించిన సన్‌రైజర్స్ తొలిసారి టైటిల్‌ను సాధించింది. కాగా, హైదరాబాద్ ఐపిఎల్‌లో విజేతగా నిలవడం ఇది రెండోసారి.

05/30/2016 - 06:48

న్యూఢిల్లీ, మే 29: పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం వెంకయ్యనాయుడు, వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభ అభ్యర్థిత్వాల పట్ల కర్నాటక బిజెపి, ఆంధ్ర తెలుగుదేశం పార్టీల నుంచి గట్టి వ్యతిరేకత రావటంతో బిజెపి అధినాయకత్వం చివరి నిమిషంలో నిర్ణయాలు మార్చుకుంది. వెంకయ్య అభ్యర్థిత్వం పట్ల కర్నాటక బిజెపిలో తిరుగుబాటు పరిస్థితులు తలెత్తడంతో, ఆయనకు రాజస్తాన్ నుంచి రాజ్యసభ టికెట్ కేటాయించింది.

05/30/2016 - 06:45

దావణగెరె (కర్నాటక), మే 29: కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత రెండేళ్ల కాలంలో 700కు పైగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను చేపట్టామని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. వీటిలో కొన్ని పథకాలు అమలులోకి రాకపోయినా, చేపట్టిన ప్రయత్నాలు సఫలం కాకపోయినా ‘ఎట్టి పరిస్థితుల్లోనూ దేశాన్ని తప్పుడు పథంలో ముందుకు వెళ్లనివ్వను’ అని ఉద్ఘాటించారు.

05/29/2016 - 21:12

తిరుపతి:ఆంధ్రప్రదేశ్‌నుంచి రాజ్యసభ అభ్యర్థిగా రైల్వేమంత్రి సురేశ్‌ప్రభు పేరును బిజెపి అధిష్టానం ప్రతిపాదించగా మిత్రపక్షమైన తెలుగుదేశం అధినేత చంద్రబాబు అందుకు ఆమోదం తెలిపారు. మద్దతు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఇక టిడిపి తరపున పుష్పరాజ్ పేరును ఖరారు చేశారు. మహానాడు సందర్భంగ ఆదివారం సాయంత్రం సమావేశమైన టిడిపి పొలిట్‌బ్యూరో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

Pages