S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/31/2016 - 06:25

న్యూఢిల్లీ, మే 30: ఆర్‌జెడి అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ రాజకీయమంతా తన కుటుంబ సభ్యులు చుట్టూ తిరుగుతుందనేది మరోసారి రుజువు చేశారు. తన కూతురు మీసా భారతిని రాజ్యసభకు ఎంపిక చేయటంద్వారా ఆయన మరోసారి కుటుంబ సభ్యులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తాననేది ప్రకటించుకున్నారు.

05/30/2016 - 17:17

దిల్లీ: ‘బాలికావధు’ ఫేమ్ టీవీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసులో ఆమె ప్రియుడు రాహుల్‌రాజ్‌సింగ్‌ను ముందస్తు బెయిల్ రద్దు చేసేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. తన కుమార్తె మరణానికి కారకుడైన రాహల్‌కు ముందస్తు బెయిల్ ఇవ్వరాదంటూ ప్రత్యూష తల్లి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. రాహుల్ గతంలోనే బాంబే హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందారు.

05/30/2016 - 15:00

పుదుచ్చేరి: కాంగ్రెస్ శాసనసభా పక్షం నేతగా ఎన్నికైన నారాయణ స్వామి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమేనని లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కిరణ్ బేడీని సోమవారం కలిసిన సందర్భంగా తెలిపారు. పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, డిఎంకె కూటమి మెజారిటీ సీట్లను సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా నారాయణస్వామి పేరును కాంగ్రెస్ హైకమాండ్ ఇదివరకే ఖరారు చేసింది.

05/30/2016 - 14:59

దిల్లీ: బిజెపి అధిష్ఠానం ఆదేశాల మేరకే తాను ఈసారి కర్నాటక నుంచి రాజ్యసభకు పోటీ చేస్తున్నానని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం తెలిపారు. ఆమె ఇంతవరకూ ఎపి నుంచి రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగారు. తనను మళ్లీ ఎపి నుంచి ఎందుకు ఎంపిక చేయలేదో తెలియదని, మంగళవారం నాడు కర్నాటకలో తాను నామినేషన్ వేస్తానని ఆమె చెప్పారు.

05/30/2016 - 14:57

లక్నో: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు యుపిలోని పలు ప్రాంతాలు వరద బీభత్సాన్ని ఎదుర్కొంటున్నాయి. వరదల వల్ల ఇంతవరకూ 12 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక గ్రామాల్లోకి వరద నీరు చొచ్చుకువచ్చింది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు పంపడంలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. వరద పరిస్థితిని పర్యవేక్షిస్తూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

05/30/2016 - 08:04

న్యూఢిల్లీ/ అద్దంకి, మే 29: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా సమీపంలో గల టప్పల్ జేవర్ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు ఆదివారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదానికి గురైంది.

05/30/2016 - 08:03

న్యూఢిల్లీ,మే 29: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఎన్నికల హామీని భాజపా తుంగలో తొక్కిందని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. రెండు రోజుల పాటు ఢిల్లీలో జరిగిన సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరైన రామకృష్ణ విలేఖరులతో ఆదివారం మాట్లాడారు. ప్రత్యేక హోదా, విభజన హామీలపై పుస్తకాలు వేయించుకున్న వెంకయ్యనాయుడు,కేంద్రమంత్రిగా ఏపీకి ఇచ్చిన హామీలపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

05/30/2016 - 07:52

బెంగళూరు, మే 29: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో చరిత్రాత్మక ప్రయోగాన్ని చేపట్టబోతోంది. 2008లో ఒకే మిషన్‌లో 10 ఉపగ్రహాలను రోదసిలోకి పంపించిన ఇస్రో, ఈసారి ఏకంగా 22 ఉపగ్రహాలను ప్రయోగించబోతోంది. ‘‘ప్రస్తుతం పునర్వినియోగ వాహక నౌకకు సంబంధించి మరో ప్రయోగం చేయాల్సి ఉంది. మేం దాని గురించి ఆలోచిస్తున్నాం.

05/30/2016 - 07:52

న్యూఢిల్లీ, మే 29: ప్రతిష్ఠాత్మక ఐఐటి సంస్థల్లో ప్రవేశానికి బోలెడంత పోటీ ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే వేల రూపాయలు ఫీజులు చెల్లించి కోచింగ్ సెంటర్లలో ఓచింగ్ తీసుకుంటుంటారు.

05/30/2016 - 07:51

న్యూఢిల్లీ, మే 29: ఒకే వ్యక్తి రెండుసార్లు దాఖలు చేయకుండా చూడడానికి, అలాగే మరింత పారదర్శకత తీసుకురావడానికి ప్రభుత్వం ఇప్పుడున్న ఎస్సీ విద్యార్థులకు పోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల పథకంలో మార్పులు చేయాలని యోచిస్తోంది.

Pages