జాతీయ వార్తలు

జెఇఇ విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 29: ప్రతిష్ఠాత్మక ఐఐటి సంస్థల్లో ప్రవేశానికి బోలెడంత పోటీ ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే వేల రూపాయలు ఫీజులు చెల్లించి కోచింగ్ సెంటర్లలో ఓచింగ్ తీసుకుంటుంటారు. అయితే కోచింగ్ సెంటర్ల ప్రభావాన్ని తగ్గించడానికి, ఐఐటిలలో ప్రవేశానికి నిర్వహించే జెఇఇ ఎంట్రన్స్ పరీక్ష రాయాలనుకునే విద్యార్థుల కోసం ఐఐటి విద్యార్థుల చేత మాడ్యూల్స్‌ను రూపొందింపజేయాలని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. ఐఐటి విద్యార్థుల చేత ఒక యాప్‌ను తయారు చేయించాలని స్మృతి ఇరానీ నేతృత్వంలోని ఈ మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. ఇందులో ఇంగ్లీషు, హిందీ, బెంగాలీ, తమిళం, తెలుగు, ఒరియా, కన్నడం, మలయాళం, మరాఠీ, గుజరాతీ, పంజాబీ తదితర 11 భాషల్లో అత్యంత నాణ్యమైన స్టడీ మెటీరియల్ విద్యార్థులకు ఉచితంగా లభిస్తుంది. ఈ మెటీరియల్ అత్యంత నాణ్యమైనదిగా ఉండాల్సిన అవసరం ఉంది.
అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మాథ్స్‌ల సిలబస్‌లకు చెందినదై ఉండాలి. రెండో సంవత్సరం ఐఐటి విద్యార్థులనుంచి వలంటీర్లను ఆహ్వానించాలన్నది మంత్రిత్వ శాఖ ఆలోచన అని, ఒక యాంకర్ ప్రొఫెసర్ నేతృత్వంలో వీరు వివిధ టాపిక్స్‌ను ప్రిపేర్ చేస్తారని హెచ్‌ఆర్‌డి శాఖకు చెందిన అధికారులు చెప్పారు. ఐఐటి ఎంట్రన్స్ పరీక్షకోసం సిద్ధం కావడానికి కనీసం 150 ప్రధాన టాపిక్‌లుంటాయని ఆ అధికారులు చెప్పారు. విద్యార్థులకు ఎంత బాగా బోధించగలుగుతారో నోట్స్ తయారు చేయమని ఐఐటి విద్యార్థులను ఆహ్వానిస్తామని, ఈ అనుభవం ఆధారంగా గెలుపొందే ఎంట్రీలను ఎంపిక చేస్తామని వారు చెప్పారు. ఒక్కో టాపిక్‌కు ఒక్కో ఐఐటి విద్యార్థుల బృందం ఉంటుందని వారు చెప్పారు. ఎంపికయిన ఒక్కో టాపిక్‌కు లక్ష రూపాయల దాకా గౌరవ భృతి ఉంటుందని కూడా వారు తెలిపారు.