జాతీయ వార్తలు

స్కాలర్‌షిప్ నిబంధనల్లో మార్పులు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 29: ఒకే వ్యక్తి రెండుసార్లు దాఖలు చేయకుండా చూడడానికి, అలాగే మరింత పారదర్శకత తీసుకురావడానికి ప్రభుత్వం ఇప్పుడున్న ఎస్సీ విద్యార్థులకు పోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల పథకంలో మార్పులు చేయాలని యోచిస్తోంది. మహారాష్టల్రోని అత్యంత వెనుకబడిన ఆరు జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అమలయ్యే పోస్టుమెట్రిక్ స్కాలర్‌షిప్, ఫ్రీషిప్ పథకంలో పెద్దఎత్తున అక్రమాలు వెలుగు చూసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్య తీసుకోవాలని అనుకుంటోంది. సవరించిన గైడ్‌లైన్స్ ప్రకారం విద్యార్థి ఎస్‌ఎస్‌సి రోల్ నంబరు, పరీక్ష పాసయిన తేదీ, సంవత్సరాన్ని రాష్ట్ర విద్యా బోర్డు లేదా ఇతర బోర్డుల ఐడిద్వారా సరిపోల్చి చూడడం, అలాగే లబ్ధిదారులు తప్పనిసరిగా ఆధార్‌లో ఎన్‌రోల్‌లో చేసుకునేలా చూడడంద్వారా విద్యార్థి ప్రత్యేకతను కాపాడుతారు. అలాగే ఆధార్‌ను లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలతో అనుసంధానం చేయాలని కూడా యోచిస్తున్నట్లు సామాజిక న్యాయం, సాధికారికత మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. దరఖాస్తులు సమర్పించడానికి, పరిశీలనకు కచ్చితమైన గడువులు ఉండేలా చూడాలని భావిస్తున్నారు. బిఏ, బికాం, బిఎస్సీ, ఎంఏ, ఎంఎస్‌సిలాంటి మామూలు కోర్సులకు సంబంధిత అధికారికి విద్యాసంస్థలు దరఖాస్తులు సమర్పించే చివరి తేదీ ఆగస్టు 31ని మించకూడదని, ప్రొఫెషనల్ కోర్సులకు ఈ గడువు నవంబర్ 30గా ఉంటుందని ఆ అధికారి చెప్పారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు చెందిన సంబంధిత సంస్థ గుర్తించిన విద్యాసంస్థలు మాత్రమే ఈ పథకం కోసం దరఖాస్తు చేసేలా చూడడానికి విద్యా సంస్థల మ్యాపింగ్ తప్పనిసరిగా ఉండాలని కూడా ఆ గైడ్‌లైన్స్‌లో స్పష్టంగా పేర్కొనబోతున్నారు.
అలాగే లబ్ధిదారుల సంఖ్యపైనకూడా పరిమితి కూడా ఉండాలని ఆ ఉన్నతాధికారి చెప్పారు. ఎస్‌సి విద్యార్థులు ఇంజనీరింగ్, మెడికల్‌లాంటి పోస్టు మెట్రిక్ కోర్సులు చదవడానికి ఈ స్కాలర్‌షిప్పుల వల్ల వీలవుతుంది. రాష్ట్రాలు అమలు చేసే ఈ పథకానికి వందశాతం నిధులను కేంద్రమే సమకూరుస్తుంది.