S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/28/2016 - 07:24

న్యూఢిల్లీ, మే 27: ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై ఉత్కంఠకు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తెరదించారు. వారం రోజుల్లో ఏపికి కొత్త సారధిని ప్రకటిస్తామని అమిత్‌షా శుక్రవారం ఇక్కడ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి బిజెపికి రాజ్యసభ సీటు కేటాయింపుపై తెలుగుదేశం పార్టీతో చర్చ లు జరుగుతున్నాయని ఆయన చెప్పారు.

05/28/2016 - 07:23

న్యూఢిల్లీ,మే 27: దేశవ్యాప్తంగా వైద్యవిద్య కోర్సుల్లో ఉమ్మడి ప్రవేశ పరీక్ష (నీట్)ను ఏడాది పాటు వాయిదా వేస్తూ కేంద్ర తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. నీట్ ఆర్డినెన్స్‌పై స్టే విధించాలని ఇండోర్ వైద్యుడు ఆనంద్‌రాయ్ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీం కోర్టులో విచారణకు వచ్చింది. శుక్రవారం సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ జస్టిస్ పి.సి పంథ్, జస్టిస్ డి.వై.

05/28/2016 - 07:10

న్యూఢిల్లీ, మే 27: ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రివర్గాన్ని త్వరలోనే పునర్వ్యవస్థీకరించే అవకాశం ఉందని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా సంకేత ప్రాయంగా తెలిపారు. ఇందులో భాగంగా పనిచేయని మంత్రులపై వేటువేసి..కొత్తవారిని మంత్రివర్గంలో చేర్చుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

05/28/2016 - 07:10

న్యూఢిల్లీ, మే 27: పర్యావరణ అనుమతులకు విరుద్ధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలు చేపడుతున్నారంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జిటి)లో పోలవరం రైతు సంక్షేమ సంఘం, రేలా స్వచ్ఛంద సంస్థలు పిటిషన్ దాఖలు చేశాయి. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల రద్దుకోరుతూ సవరణలతో కూడిన పిటిషన్ దాఖలు చేస్తే అప్పడు పరీశిలీస్తామని ఎన్‌జిటి తెలిపింది.

05/28/2016 - 07:00

న్యూఢిల్లీ, మే 27: అసోంలో నాలుగు బూటకపు ఎన్‌కౌంటర్లు జరిగినట్లు జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సి) నిర్ధారించింది. ఈ బూటకపు ఎన్‌కౌంటర్లలో మృతి చెందిన ఆరుగురు బాధితుల కుటుంబాలకు కలిపి మొత్తం రూ. 30 లక్షలు నష్టపరిహారంగా చెల్లించాలని అసోం ప్రభుత్వాన్ని, రక్షణ మంత్రిత్వ శాఖను ఆదేశించింది.

05/28/2016 - 06:10

వాషింగ్టన్, మే 27: భారత్, పాకిస్తాన్‌ల మధ్య శాంతి పథం అనేది ఇరు దేశాలకు సంబంధించినదని, ఇరు దేశాలు కృషి చేస్తేనే శాంతియుత సంబంధాలు నెలకొంటాయని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలకు పాకిస్తాన్ స్వయంగా విధించుకున్న ఉగ్రవాదం అనే అడ్డంకి ఉందని పేర్కొంటూ ఈ అడ్డంకిని తొలగించుకోవలసిన అవసరం ఉందని ఆయన పాకిస్తాన్‌కు హితవు పలికారు.

05/28/2016 - 06:03

న్యూఢిల్లీ, మే 27: ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకోవాలని ఉందా? అయితే ఎన్డీఏ సర్కార్ పాలనపై మీ అవగాహనకు పదును పెట్టుకోండి. ఈ విషయంలో 20 ప్రశ్నలకు ఐదే ఐదు నిమిషాల్లో జవాబు చెప్పగలిగితే మీ కల నిజవౌతుంది. మీరు ప్రధానిని కలుసుకోవడమే కాదు, ఆయన సంతకంతో ఓ సర్ట్ఫికెట్ కూడా సొంతమవుతుంది. పాలనాపరమైన అంశంపై ప్రభుత్వం ఈ క్విజ్‌ను నిర్వహిస్తోంది.

05/28/2016 - 08:14

న్యూఢిల్లీ, మే 27: దేశానికి దిశ, దశను నిర్దారించే నిర్ణయాత్మక ప్రభుత్వాన్ని ప్రజలకు అందజేసిన ఘనత బిజెపికే దక్కుతుందని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా అభిప్రాయపడ్డారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా అమిత్ షా శుక్రవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

05/28/2016 - 05:58

కోల్‌కతా, మే 27: తృణమూల్ కాం గ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ శుక్రవారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతోపాటు 41 మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు. కాంగ్రెస్-లెఫ్ట్ కూటమి, రాష్ట్ర బిజెపి మమత ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బాయ్‌కాట్ చేశాయి. అయితే కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ, అశోక్ గజపతి రాజు, బాబుల్ సుప్రియో మమత ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.

05/28/2016 - 05:57

న్యూఢిల్లీ, మే 27: భారతీయ రైల్వేలను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు వెల్లడించారు. ఐసియులో ఉన్న రైల్వేలను బయటకు తీసుకొచ్చేందుకు అనువైన వాతావరణం కల్పించే దిశగా అనేక చర్యలు తీసుకుంటున్నట్టు శుక్రవారం ఇక్కడ స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజారవాణ వ్యవస్థ అయిన భారతీయ రైల్వేలు ఇరవై, ముప్పై ఏళ్లుగా అనేక ఒడుదుడుకులను ఎదుర్కొంటోందని మంత్రి పేర్కొన్నారు.

Pages