జాతీయ వార్తలు

సొంత లాభం కొంత చూసుకుని...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 30: ఆర్‌జెడి అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ రాజకీయమంతా తన కుటుంబ సభ్యులు చుట్టూ తిరుగుతుందనేది మరోసారి రుజువు చేశారు. తన కూతురు మీసా భారతిని రాజ్యసభకు ఎంపిక చేయటంద్వారా ఆయన మరోసారి కుటుంబ సభ్యులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తాననేది ప్రకటించుకున్నారు. గతంలో తన భార్యను బిహార్ ముఖ్యమంత్రిగా నియమించి జైలునుండి పరోక్షంగా బిహార్ ప్రభుత్వాన్ని నడిపించిన లాలూ ప్రసాద్ యాదవ్ ఇద్దరు కుమారులు తేజ్ ప్రసాద్ యాదవ్, తేజస్వీ ప్రసాద్ యాదవ్‌లు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నాయకత్వంలోని బిహార్ మంత్రివర్గంలో మంత్రులుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. లాలూ ప్రసాద్ యాదవ్ మొదటి కుమారుడు తేజ్ ప్రసాద్ యాదవ్ బిహార్ ఆరోగ్య శాఖ మంత్రిగా కొనసాగుతుంటే, తొమ్మిదో తరగతిలో ఫైయిల్ అయినా రెండో కుమారుడు తేజస్వీ ప్రసాద్ యాదవ్ బిహార్ ఉపముఖ్యమంత్రిగా పనిచేయటం తెలిసిందే. ఇద్దరు కుమారులను మంత్రులను చేసిన లాలూ ప్రసాద్ యాదవ్ తాజాగా తన తొమ్మిది మంది సంతానంలోని పెద్దదైన మీసా భారతిని రాజ్యసభకు ఎంపిక చేయటంద్వారా మరో చరిత్రను సృష్టించారని చెప్పక తప్పదు. రాజ్యసభకు జరుగుతున్న ద్వైవార్షిక ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్.జె.డి) ఇద్దరిని రాజ్యసభకు పంపించేందుకు వీలున్నది. లాలూ ప్రసాద్ యాదవ్ తన రాజకీయ, న్యాయపరమైన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ రెండు సీట్లకు అభ్యర్థులను ఎంపిక చేయటం గమనార్హం. మొదటి సీటుకు ఆయన తన పెద్ద కూతురు మీసా భారతిని ఎంపిక చేస్తే రెండో సీటుకు ప్రముఖ న్యాయవాది రామ్‌జెత్మలానీని ఎంపిక చేయటం చర్చనీయాంశంగా మారింది. మీసా యాదవ్, రామ్‌జెత్మలానీ సోమవారం పాట్నాలో రాజ్యసభకు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. మీసా భారతి 2014లో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో పాటలీపుత్ర నియోజవర్గం నుండి పోటీచేసి ఓడిపోవటం తెలిసిందే. బిజెపి టికెట్‌పై పోటీచేసిన రాం క్రిపాల్ యాదవ్ చేతిలో మీసా భారతి ఓడిపోయారు. రాంక్రిపాల్ యాదవ్ లాలూకు అత్యంత సన్నిహితుడు, సమీప బంధువు కూడా. లాలూ 2014 లోక్‌సభ ఎన్నికల్లో పాటలీపుత్ర నియోజకవర్గం నుండి మీసా భారతిని పోటీ చేయించాలని నిర్ణయించటంతో రాంక్రిపాల్ యాదవ్ ఆర్‌జెడికి రాజీనామా చేసి బిజెపిలో చేరటంతోపాటు టికెట్ సంపాదించి లోక్‌సభకు ఎన్నికయ్యారు. లాలూ ప్రసాద్ ఆ రోజు నుండి మీసా భారతిని పార్లమెంటుకు పంపించాలనే ఆలోచనతోనే ఉన్నారు. ఇప్పుడు బిహార్‌లో తమ కూటమి అధికారంలో ఉండటంతో మీసా భారతిని రాజ్యసభకు పంపిస్తున్నారు. ఆర్‌జెడి రెండోసీటు సంపాదించి సోమవారం నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన రామ్‌జత్మలానీ ఆదివారమే పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. పార్లమెంటులో మీసా భారతి ఆర్‌జెడి అధినేత రాజకీయ ప్రయోజనాలను కాపాడేందుకు కృషిచేస్తే, రామ్‌జెత్మత్మలానీ సుప్రీం కోర్టులో లాలూ ప్రసాద్ యాదవ్ ప్రయోజనాలు కాపాడుతారని అంటున్నారు. లాలూపై పశుగ్రాసం కేసుతోపాటు పలు ఇతర క్రిమినల్, సివిల్ కేసులు ఉండటం తెలిసిందే. లాలూ కుటుంబంలో ఇప్పుడు ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, ఒక ఉపముఖ్యమంత్రి, ఒక మంత్రి, ఇప్పుడు కొత్తగా ఒక రాజ్యసభ సభ్యత్వం లభించటం గమనార్హం.

లాలూ కుటుంబ సభ్యులతో బీహార్ సీఎం నితీశ్‌కుమార్, రామ్‌జత్మలానీ