జాతీయ వార్తలు

కులం కులమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 29: ఇంటిపేరు మారినంతమాత్రాన ఒక వ్యక్తి కులం మారిపోదని బొంబాయి హైకోర్టు స్పష్టం చేసింది. ఇంటిపేరు మార్చుకున్నాడన్న కారణంగా సరయిన కుల సర్ట్ఫికెట్ ఉన్నప్పటికీ ఎస్టీ కోటా కింద పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులో అడ్మిషన్ నిరాకరించిన ఒక వైద్య విద్యార్థికి ఈ తీర్పుతో ఊరట లభించింది. తన వద్ద కులధ్రువీకరణ సర్ట్ఫికెట్ ఉన్నప్పటికీ, తాను షెడ్యూల్డ్ కులాలకు చెందినప్పటికీ, ఇంటిపేరు మార్చుకున్నానన్న కారణంపై పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సులో అడ్మిషన్‌కోసం తాను చేసుకున్న దరఖాస్తును తిరస్కరించారని పిటిషనర్ వాదించారు. అయతే ఇంటిపేరు మారితే దానితో ఆ వ్యక్తి కులం మారదని, అంతేకాదు తన ఇంటిపేరు మారినట్లు ప్రభుత్వ గజెట్‌లో కూడా నోటిఫై చేయడం జరిగిందని పిటిషనర్ నిర్దిష్టంగా పేర్కొన్నాడని కోర్టు పేర్కొంది. అందువల్ల పిటిషనర్ దగ్గర గనుక సరయిన సర్ట్ఫిట్ ఉన్నట్లయితే, అతని పేరుమార్పును ప్రభుత్వ నోటిఫికేషన్ గనుక నోటిఫై చేసి ఉన్నట్లయితే పిటిషనర్ క్లెయిమ్‌ను పరిశీలించాలని ప్రతివాదులను ఆదేశిస్తున్నట్లు కోర్టు తెలిపింది. హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను సంబంధిత కాలేజి అధికారులకు తెలియజేయాలని న్యాయమూర్తులు శాలిని ఫన్‌సల్కార్-జోషీ, బిఆర్ గవాయిలతో కూడిన బెంచ్ ఈ నెల 23న జారీ చేసిన ఉత్తర్వులో ప్రభుత్వ ప్లీడర్‌ను ఆదేశించింది. ఎంబిబిఎస్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఎస్టీల రిజర్వ్‌డ్ కోటా కింద తాను పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సులో అడ్మిషన్ కోరానని, అయితే కాలేజి అధికారులు ఏకపక్షంగా అడ్మిషన్ నిరాకరించారని పిటిషనర్ అయిన శంతను హరి భరద్వాజ్ వాదించాడు. తన ఉపకులం టోక్రే కోలీ అని, భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ ప్రకారం ఇది గిరిజన తెగకు చెందినదని కూడా అతను వాదించారు. తన ఒరిజినల్ ఇంటిపేరు ‘సప్కాలే’ అని, అయితే 1999లోనే మహారాష్ట్ర ప్రభుత్వ గజెట్‌లో అధికారిక ప్రచురణ ద్వారా తాను, తన తమ్ముడు తమ ఇంటి పేరును సప్కాలేనుంచి భరద్వాజ్‌కు మార్చుకున్నామని అతను వాదించాడు.