జాతీయ వార్తలు

ఫిన్‌మెకానికా టెండర్లన్నీ రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 29: రక్షణ రంగ సామగ్రిని సరఫరా చేయడానికి ఇటలీకి చెందిన ఫిన్‌మెకానికా, దాని అనుబంధ సంస్థలు దక్కించుకున్న ప్రస్తుత టెండర్లన్నింటినీ రద్దు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఫిన్‌మెకానికాను బ్లాక్ లిస్టులో పెట్టడానికి ముందస్తు చర్యగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అగస్టా వెస్ట్‌లాండ్ వివిఐపి హెలికాప్టర్ల కొనుగోలులో ముడుపుల కుంభకోణంలో ఫిన్‌మెకానికా పాత్రపై భారత్ దర్యాప్తు జరిపిస్తున్న విషయం తెలిసిందే. భారత రక్షణ మంత్రి మనోహర్ పారికర్ పిటిఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడించారు. ఫిన్‌మెకానికా, దాని అనుబంధ సంస్థలను బ్లాక్‌లిస్టులో పెట్టే ప్రక్రియ ఇదివరకే ప్రారంభమయిందని, ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు ఒక నోట్ కూడా పంపించడం జరిగిందని ఆయన చెప్పారు. అయితే రక్షణ శాఖ వార్షిక నిర్వహణ, విడిభాగాల దిగుమతులకు సంబంధించి ఫిన్‌మెకానికా నుంచి ఇదివరకే కొనుగోలు చేసిన వాటికి సంబంధించిన లావాదేవీలు ఆ సంస్థతో కొనసాగుతాయని, కొత్తగా కొనుగోళ్లను మాత్రం నిలిపివేసినట్లు మంత్రి వివరించారు. ఆ కంపనీ తప్పు చేసినంత మాత్రాన జాతీయ భద్రత విషయంలో రాజీపడబోమని ఆయన అన్నారు. ఫిన్‌మెకానికా నుంచి ఒక విడిభాగాన్ని దిగుమతి చేసుకోకుండా ఉండి ఆరు నౌకలను పనిచేయనివ్వకుండా నిలిపివేయలేము కదా అని ఆయన వ్యాఖ్యానించారు. అన్ని ‘రిక్వెస్ట్స్ ఫర్ ప్రపోజల్స్’ (ఆర్‌ఎఫ్‌పి)లను మూసివేయనున్నట్లు ఆయన తెలిపారు. యుపిఎ హయాంలో ఫిన్‌మెకానికా అనుబంధ సంస్థ వాస్ నుంచి సోక్‌ప్రిన్ జలాంతర్గాముల కోసం భారీ వైట్ డోర్పెడోస్ కొనుగోలుకు ఉద్దేశించిన ఆర్‌ఎఫ్‌పిని ఎన్‌డిఎ ప్రభుత్వం ఇప్పటికే ఉపసంహరించుకుంది. అయితే నిర్దిష్టంగా ఎన్ని సంవత్సరాలు బ్లాక్‌లిస్టులో పెడుతున్నది తరువాత ప్రకటిస్తామని పారికర్ తెలిపారు. ఎన్ని సంవత్సరాలు నిర్ణయిస్తే అనే్నళ్లపాటు రక్షణ మంత్రిత్వ శాఖ ఫిన్‌మెకానికా, దాని అనుబంధ సంస్థలతో ఎలాంటి లావాదేవీలు జరుపబోదని వివరించారు.