S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/28/2016 - 05:55

కోల్‌కతా, మే 27: పశ్చిమ బెంగాల్‌లో ఒంటిచేత్తో తన పార్టీని విజయపథంతో నడిపించిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రాంతీయ పార్టీ నేతగా తన ప్రతిష్ఠను ఇనుమడింపజేసుకున్నారు కానీ ముఖ్యమంత్రిగా రెండోసారి అధికారం చేపట్టిన ఆమె అభివృద్ధి విషయంలో లెక్కలేనన్ని సవాళ్లు ఎదుర్కొంటున్నారు.

05/28/2016 - 08:11

న్యూఢిల్లీ, మే 27: భూమిపై నుంచి ప్రయోగించే బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణిని భారత వాయుసేన శుక్రవారం విజయవంతంగా ప్రయోగించింది. రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లాలో గల పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ నుంచి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు సమాచారం. ఈ క్షిపణి నిర్దిష్ట లక్ష్యాన్ని ఛేదించిందని అధికారులు ధ్రువీకరించారు.

05/28/2016 - 05:52

డెహ్రాడూన్, మే 27: తనను రాజకీయంగా ఎదుర్కొనలేకే సిబిఐను కేంద్రం ఉసిగొల్పుతోందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ ధ్వజమెత్తారు. తన ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూసి భంగపడ్డ ఎన్‌డిఏ ప్రభుత్వం సిబిఐను పావుగా వాడుకుంటోందని శుక్రవారం ఇక్కడ విరుచుకుపడ్డారు.‘బిజెపి, నరేంద్ర మోదీ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం సిబిఐని వాడుకుంటోంది. ఈ కుట్రలను ఎలాతిప్పికొట్టాలో మాకు తెలుసు’అని రావత్ స్పష్టం చేశారు.

05/27/2016 - 15:57

చెన్నై: బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ ప్రయాణీకుడిని ఇక్కడి ఎయిర్‌పోర్టులో శుక్రవారం అధికారులు తనిఖీ చేసి 3.6 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వివరాల కోసం నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

05/27/2016 - 15:56

దిల్లీ: ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ రెండేళ్ల పాలన పూర్తయిన నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు జరిగే అవకాశాలున్నాయని బిజెపి అధ్యక్షడు అమిత్ షా శుక్రవారం ఇక్కడ మీడియాకు సూచన ప్రాయంగా తెలిపారు. మంత్రుల పనితీరును బేరీజు వేసి మోదీ తన క్యాబినెట్‌లో మార్పులు చేస్తారని ఆయన చెప్పారు.

05/27/2016 - 15:55

గయ: బిహార్‌లో జెడియు పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్సీ మనోరమ దేవికి బెయిల్ ఇచ్చేందుకు గయ జిల్లా కోర్టు మరోసారి నిరాకరించింది. కొత్త ఎక్సయిజ్ చట్టానికి విరుద్ధంగా ఇంట్లో మద్యం సీసాలు ఉంచి దొరికిపోయిన ఆమెను పోలీసులు ఇటీవల అరెస్టు చేసి జైలుకు తరలించారు. బెయిల్ కోసం కొద్దిరోజుల క్రితం కూడా ఆమె ప్రయత్నించారు.

05/27/2016 - 15:55

పాట్నా: పంచాయితీ ఎన్నికల సందర్భంగా బిహార్‌లో శుక్రవారం ఉదయం నుంచి అక్కడక్కడా హింసాత్మక సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. నలందా జిల్లా కంచన్‌లో బిజెపి, ఆర్‌జెడి కార్యకర్తలు ఘర్షణ పడి పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. తర్వాత తుపాకులను కూడా పేల్చారు. ఈ విషయం తెలుసుకుని పరిస్థితిని చక్కదిద్దేందుకు వెళ్లిన పోలీసులు కూడా రాళ్లదాడిలో గాయపడ్డారు. గాయపడిన వారిని నలందాలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

05/27/2016 - 15:52

దిల్లీ: ఎపి నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల్లో తమ పార్టీకి ఒక సీటు కేటాయించాలన్న విషయమై టిడిపి అధినేత చంద్రబాబుతో చర్చలు జరుపుతామని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా శుక్రవారం ఇక్కడ తెలిపారు. ఎపిలో ఎన్నిక జరిగే నాలుగు రాజ్యసభ స్థానాల్లో టిడిపి మూడు, వైకాపా ఒక సీటును గెలుచుకునే పరిస్థితి ఉంది. మిత్రపక్షమైన తమకు ఒక సీటు కేటాయించాలని రాష్ట్ర బిజెపి నేతలు కోరుతున్నారు.

05/27/2016 - 13:48

కోల్‌కత: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా శుక్రవారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌కు బదులు రెడ్‌రోడ్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఆమెతో పాటు 41 మంది మంత్రులు ప్రమాణం చేశారు. రాష్ట్ర గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠీ వీరి చేత ప్రమాణం చేయించారు. ఈసారి మంత్రివర్గంలో 17 మంది కొత్తవారికి ఆమె అవకాశం కల్పించారు.

05/27/2016 - 13:44

రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో గడిదాస్ అటవీ ప్రాంతంలో సిఆర్‌పిఎఫ్ పోలీసులు విస్తృతంగా కూంబింగ్ జరిపి గురువారం రాత్రి 14 మంది మావోయిస్టులను అరెస్టు చేశారు. కొద్దిరోజుల క్రితం ఎస్సార్ స్టీల్స్ కంపెనీకి చెందిన పైపులైన్‌ను పేల్చివేసిన ఘటనలో వీరంతా నిందితులని పోలీసులు చెబుతున్నారు.

Pages