జాతీయ వార్తలు

నల్లధనంపై స్విస్ అధ్యక్షుడిని కలవనున్న మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 29: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జూన్ నాలుగో తేదీ నుంచి అయిదు దేశాల పర్యటన చేయనున్నారు. అఫ్గానిస్థాన్, ఖతార్, స్విట్జర్లాండ్, అమెరికా, మెక్సికోలలో మోదీ పర్యటిస్తారు. భారత నిధులతో (రూ.1400కోట్లు) నిర్మించిన సల్మా డ్యాంను అఫ్గాన్‌లో ఆయన ప్రారంభిస్తారు. ఖతార్‌లో రెండురోజుల పర్యటన సందర్భంగా అక్కడి రాజు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో విస్తృతంగా చర్చలు జరపనున్నారు. ముఖ్యంగా హైడ్రోకార్బన్ రంగానికి సంబంధించి ఆర్థిక సంబంధాలపై మంతనాలు జరుపుతారు. స్విట్జర్లాండ్‌లో అక్కడి నాయకత్వంతో మోదీ చర్చలు జరుపుతారు. నల్లధనాన్ని బయటకు తీసుకురావటంపై స్విస్ అధ్యక్షుడు జొహన్ ష్నెదర్ అమ్మన్‌తో మోదీ కీలకమైన చర్చలు జరిపే అవకాశం ఉంది. పన్ను సంబంధిత సమాచారాన్ని పరస్పరం అందించుకునేలా ఇరుదేశాల అధికారుల మధ్య తుది చర్చలు ఇప్పటికే జరుగుతున్నాయి. జూన్ 7న మోదీ అమెరికా వెళ్తారు. రక్షణ, భద్రత, ఇంధన రంగాలలో ఇరుదేశాల సహకారంలో పురోగతికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో ఆయన సమీక్ష చేస్తారు. అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ఆయన ప్రసంగిస్తారు. తిరుగు ప్రయాణంలో మెక్సికోను కూడా ఆయన సందర్శిస్తారు.

బియాంత్‌సింగ్ మనవడి మృతి
చండీగఢ్, మే 29: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్‌సింగ్ మనవడు హర్కిరత్ సింగ్ (40) ఆదివారం అనుమానాస్పదంగా మరణించారు. ‘హర్కిరత్ తన ఇంట్లో తలలో బుల్లెట్ గాయంతో చనిపోయారు. ఈ బుల్లెట్ గాయం ఎలా అయిందనే సమాచారం ఇంకా స్పష్టం కాలేదు. అతని తల్లిదండ్రులను ప్రశ్నిస్తున్నాం’ అని లూధియానా పోలీసులు తెలిపారు లూధియానా జిల్లాలోని ఓ గ్రామానికి సర్పంచ్‌గా ఉన్న హర్కిరత్‌ను స్థానిక పీజీఎంఈఆర్ వైద్య సంస్థకు చికిత్సకోసం తీసుకెళ్లినప్పటికీ ఆయన అక్కడ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఇది ఆత్మహత్య అని భావించవచ్చా అన్న ప్రశ్నకు పోలీసులు స్పష్టంగా బదులివ్వలేదు.
ఏదైనా జరిగి ఉండవచ్చనీ, దేనినీ తోసిపుచ్చలేమని దర్యాప్తు తరువాత కానీ స్పష్టం చేయలేమని పోలీసులు వెల్లడించారు. 1995 ఆగస్టు 31న అప్పుడు పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్న బియాంత్‌సింగ్ మానవబాంబు దాడిలో హతమైన విషయం తెలిసిందే.

రోడ్డు ప్రమాదంలో
భగత్ సింగ్ మనవడి మృతి
సిమ్లా, మే 29: హిమాచల్‌ప్రదేశ్‌లోని రాంపూర్ బుషర్ జిల్లా సమీపంలోని మంగ్లాద్ వద్ద ఆదివారం జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ప్రముఖ స్వాతంత్య్ర యోధుడు భగత్ సింగ్ మనవడు మృతి చెందాడు. సనవార్‌లోని లారెన్స్ స్కూలు మాజీ విద్యార్థి అయిన 27 ఏళ్ల అభిజీత్ సింగ్ మోటారు సైకిల్‌పై స్పితిలోని కజానుంచి ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. అతని మిత్రులు ఇద్దరు గురుపాల్ సింగ్, అభితేజ్‌లు వెనక కారులో వస్తున్నారు. అయితే రోడ్డు తడిగా ఉండడంతో అభితేజ్ నడుపుతున్న మోటారు సైకిల్ పట్టుతప్పడంతో అతను రోడ్డుపై పడిపోయాడని పోలీసులు చెప్పారు. తలకు, పక్కటెముకలకు బలమైన గాయాలు తగిలిన అభితేజ్‌ను హుటాహుటిన రాంపూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ కొద్ది సేపటికే చనిపోయాడని పోలీసులు తెలిపారు. కాగా, తమకు అభితేజ్ ఒక్కడే కొడుకని మొహాలీలో ఉంటున్న అతని తండ్రి అభయ్ సంధు చెప్పారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. సోమవారం మొహాలీలో అంత్యక్రియలు జరుగుతాయి.

మళ్లీ ఇంటర్‌పోల్‌కు..
లలిత్ మోదీ అరెస్టు వారంట్‌కు
దర్యాప్తు సంస్థల ప్రయత్నాలు
న్యూఢిల్లీ, మే 29: ఐపిఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ అరెస్టుకు మరోసారి ప్రయత్నం చేయాలని భారత దర్యాప్తు సంస్థలు నిర్ణయించాయి. ఇంటర్‌పోల్ ద్వారా లలిత్‌మోదీ అరెస్టు వారంటును జారీ చేయించటంలో ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇంటర్‌పోల్ ద్వారా ఇప్పటికే చాలా ఆలస్యమైన అరెస్టువారంట్ కోసం తాజాగా సంప్రతించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నిర్ణయించింది. లలిత్‌మోదీపై చెన్నై పోలీసులు తమ విచారణకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖకు, ఈడీకి సమర్పించిన తాజా నివేదికను ఆధారం చేసుకుని అతనిపై రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేయాల్సిందిగా ఇంటర్‌పోల్‌ను మరోసారి కోరాలని ఈడీ భావిస్తోంది. బిసిసిఐ మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ ఫిర్యాదుపై 2010లో ఆర్థిక అక్రమాలకు సంబంధించి కేసు నమోదు చేశారు. 2012లో లలిత్‌మోదీపై మనీలాండరింగ్ కేసు నమోదు చేయటానికి 2010నాటి ఎఫ్‌ఐఆర్ ఆధారభూతమైంది. ఈ కేసులోనే దర్యాప్తు సంస్థ ఇంటర్నేషనల్ రెడ్‌కార్నర్ నోటీసును జారీ చేయాలని ఇంటర్‌పోల్‌ని కోరింది. దీనిపై ఇంటర్‌పోల్ అడిగిన కొన్ని వివరాలకు చెన్నై పోలీసులు సమాధానం ఇవ్వాల్సి ఉందని ఇటీవల ముగిసిన పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి మహేశ్ శర్మ తెలిపిన సంగతి తెలిసిందే. చెన్నై పోలీసులు ఇచ్చిన నివేదికతో ఇంటర్‌పోల్ సందేహాలు తీర్చి రెడ్‌కార్నర్ నోటీసును జారీ చేయించాలని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి.
ఇక రాష్ట్రాల వారీగా
రుతుపవనాల సూచనలు
2017నుంచి విడుదల చేయనున్న ఐఎండి
న్యూఢిల్లీ, మే 29: భారత వాతావరణ శాఖ (ఐఎండి) వచ్చే ఏడాది నుంచి రాష్ట్రాల వారీగా రుతుపవనాల సూచనలను రూపొందించి, విడుదల చేయనుంది. కేంద్ర భూవిజ్ఞానాల శాఖ మంత్రి హర్షవర్ధన్ ఆదివారం ఈ విషయం చెప్పారు. 2018-19 నుంచి ఇతర సీజన్లకు సంబంధించిన సూచనలను కూడా తయారు చేసి విడుదల చేయనున్నట్లు కేంద్ర భూవిజ్ఞానాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎం.రాజీవన్ వెల్లడించారు. నేషనల్ మాన్‌సూన్ మిషన్ ఇదివరకే ఆమోదం పొందిందని, ఇది రూ. 400 కోట్ల ప్రాజెక్టు అని మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా డైనమిక్ మోడల్‌ను ప్రవేశపెట్టామని, పెద్ద పరిమాణం గల కంప్యూటర్లను ఇదివరకే బిగించామని ఆయన వివరించారు. 2017 నుంచి స్పేషియల్ మోడల్‌ను ప్రారంభిస్తామని, నెలవారీ మోడల్స్‌ను ఇవ్వడం ప్రారంభిస్తామని ఆయన వివరించారు. వచ్చే రెండు మూడేండ్లలో బ్లాక్ స్థాయిలో రుతుపవనాలు, వాతావరణ సూచనలను అందించే సమగ్రమైన ప్రణాళిక ఉందని ఆయన వెల్లడించారు. భారత వాతావరణ శాఖ ప్రస్తుతం ప్రతి రోజు జోన్ల వారీగా రుతుపవనాల సూచనలను అందిస్తోంది.