జాతీయ వార్తలు

ఆఫ్రికన్లకు భద్రత కల్పించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 29: ఆఫ్రికన్ జాతీయులపై జరుగుతున్న వరుస దాడులు, కాంగో మహిళ మృతి ఘటనలపై కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలకు ఉపక్రమించింది. దాడులకు కారకులైన వారిని ఉపేక్షించవద్దని, తక్షణం చర్యలు తీసుకోవాలని హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఢిల్లీ పోలీస్ కమిషనర్, లెఫ్టినెంట్ గవర్నర్‌లను ఆదేశించారు. ఆఫ్రికన్ జాతీయులు నివసిస్తున్న ప్రాంతాల్లో పెట్రోలింగ్ పెంచాలని కూడా ఆదేశించారు. ఆఫ్రికన్ జాతీయులపై దాడులకు కారకులుగా భావిస్తున్న ఎనిమిదిమందిని ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. వరుసగా జరుగుతున్న దాడులపై ఆఫ్రికా దేశాల రాయబారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఆఫ్రికా డే ఉత్సవాలను బహిష్కరిస్తామని ఉమ్మడిగా హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి నష్టనివారణ చర్యలు చేపట్టింది.
దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలిలో గురువారం జరిగిన దాడి ఘటనలో ఆరుగురు ఆఫ్రికన్ జాతీయులు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ఆదివారం నలుగురిని అదుపులోకి తీసుకున్నామని, ఐదో నిందితుడు మైనర్ అని డిసిపి ఈశ్వర్‌సింగ్ వెల్లడించారు. కాంగో మహిళ మృతికి దారితీసిన ఘటనలో మరో నలుగురిని అరెస్టు చేశారు. కాగా, ఆఫ్రికన్ జాతీయులపై జరుగుతున్న దాడులను కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ఢిల్లీ పోలీసు కమిషనర్ అలోక్ కుమార్ వర్మను పిలిపించి వివరాలు తెలుసుకున్నారు. ఈ దాడులు ఆందోళనకర పరిణామమని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు పెట్రోలింగ్‌ను పటిష్ఠం చేయాలని కూడా ఆదేశించారు. అంతకముందు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ హోంమంత్రి రాజ్‌నాథ్, లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌తో చర్చలు జరిపారు. ఆఫ్రికన్ జాతీయులు నివసిస్తున్న ప్రాంతాల్లో భరోసా కల్పించేవిధంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దాడుల ఘటనలపై విదేశాంగ శాఖ సహాయ మంత్రి జనరల్ వి.కె.సింగ్ మాట్లాడుతూ, జరిగిన ఘటనలన్నీ చిన్నపాటివేనని, మీడియా భూతద్దంలో చూపిస్తోందని వ్యాఖ్యానించారు.