జాతీయ వార్తలు

ఆరు ప్రాంతీయ భాషల్లో పిఎంఓ వెబ్‌సైట్ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 29: సామాన్య ప్రజలకు చేరువలో ఉండే విధంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కార్యాలయ (పిఎంఓ) అధికారిక వెబ్‌సైట్‌ను ప్రాంతీయ భాషల్లోకి విస్తరించి మరో ఆరు భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రారంభించిన ఈ వెబ్‌సైట్లు ఇప్పుడు తెలుగుతోపాటు తమిళ, మలయాళ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ భాషల్లో కూడా అందుబాటులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి విశదీకరించే పిఎంఓ వెబ్‌సైట్ ‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.పిఎంఇండియా.జిఓవి.ఇన్’ ఇంతకుముందు కేవలం ఇంగ్లీష్, హిందీ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే మరో ఆరు ప్రాంతీయ భాషల్లో ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన సుష్మా స్వరాజ్‌తోపాటు వీటిని రూపొందించేందుకు అలుపెరుగకుండా కృషిచేసినవారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని మోదీ ట్వీట్ చేశారు. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ఈ వెబ్‌సైట్లను మరింత బలోపేతం చేస్తామని ఆయన తెలిపారు. కాగా, పిఎంఓ వెబ్‌సైట్‌ను దశలవారీగా మరిన్ని ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తీసుకొస్తామని సుష్మా స్వరాజ్ ప్రకటించారు.
chitram...
ఢిల్లీలో ఆదివారం ప్రాంతీయ భాషల్లో అధికారిక వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్న
విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్