S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

07/28/2018 - 00:50

న్యూఢిల్లీ: దేశంలో జరుగుతున్న మూక హింసాత్మక ఘటనలపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. సామాజిక మాధ్యమాల వదంతులతో చోటు చేసుకుంటున్న ఈ ఘటనల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. జస్టిస్ బీ లోకూర్, జస్టిస్ లలిత్ ఈ కేసును విచారిస్తూ పై విధంగా వ్యాఖ్యలు చేశారు.

07/27/2018 - 23:53

చింతలపూడి, జూలై 27: పశ్చిమగోదావరి జిల్లాలో అమానుషం చోటుచేసుకుంది. చింతలపూడి సాంఘిక సంక్షేమ వసతిగృహంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థినిపై మూడురోజులపాటు ఇద్దరు యువకులు అత్యాచారం జరిపిన వ్యవహారం ఆలస్యంగా వెలుగుచూసింది. వసతి గృహంలో ఉండాల్సిన బాలిక యువకుల చెరలో ఉండటం, దీనిపై మేట్రిన్ సమాధానం చెప్పకుండా మొహం చాటేయడం పలు అనుమానాలకు తావిస్తోంది.

07/27/2018 - 06:12

అన్నవరం, జూలై 26: అన్నవరం శివార్లలోని డిగ్రీ కళాశాల సమీపంలో గురువారం ఉదయం 11.30 గంటల సమయంలో జాతీయ రహదారిపై ఐరన్ లోడుతో వెళుతున్న లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయటంతో వెనుక నుంచి వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.

07/27/2018 - 04:54

కొణిజర్ల, జూలై 26: భర్త, అత్తమామల వేధింపులు తాళ్ళలేక ఓ వివాహిత ఆత్మహత్యకు ప్రయత్నించిన సంఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన మండల పరిధిలోని కొండమాల గ్రామంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కొప్పుల చంటికి తల్లాడ మండల కేంద్రానికి చెందిన కవితతో గత ఏడాది నవంబర్ నెలలో వివాహం జరిగింది. వివాహం సందర్భంగా రెండు లక్షల రూపాయలను కట్నంగా అందచేశారు.

07/27/2018 - 02:56

హైదరాబాద్, జూలై 26: కోర్టు ధిక్కారానికి తాము పాల్పడలేదని అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు, న్యాయశాఖ సెక్రటరీ నిరంజన్‌రావు హైకోర్టుకు విన్నవించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్‌ఎ సంపత్‌కుమార్ తమపై పెట్టన ఫిటిషన్‌లను తొలగించలని వారు కోర్టును కోరారు.

07/27/2018 - 02:03

న్యూఢిల్లీ, జూలై 26: తాజ్ మహల్ పరిరక్షణకు సంబంధించి తీసుకునే చర్యలకు ఉద్దేశించిన విజన్ డాక్యుమెంట్ ముసాయిదా పత్రాన్ని తమకు అందచేయడం పట్ల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘ ఈ ముసాయిదా పత్రాన్ని మమ్మలను సరిదిద్దమంటారా ?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజ్ పరిరక్షణ విషయంలో యుపీ ప్రభుత్వం తీరు పట్ల సుప్రీం బెంచి తీవ్ర అసహనాన్ని, ఆందోళన వ్యక్తం చేసింది.

07/27/2018 - 01:59

ప్రొద్దుటూరు, జూలై 26: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలు రావడంతో కడప జిల్లా బ్రహ్మంగారిమఠం పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న చిన్న వీరయ్యను ఏసీబీ అధికారులు గురువారం అరెస్టు చేశారు. ప్రొద్దుటూరు, హైదరాబాద్, బెంగళూరులో అధికారులు ఏకకాలంలో వీరయ్యకు చెందిన ఇళ్లలో సోదాలు నిర్వహించారు. సుమారు రూ.6 కోట్ల విలువచేసే ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు.

07/27/2018 - 01:27

ఉప్పల్, జూలై 26: యువకుడిపై అకారణంగా దాడి చేసిన 15 మంది యువకులపై మేడిపల్లి పీఎస్‌లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. బోడుప్పల్ దేవేందర్ నగర్ సమీపంలోని సీతారామ నగర్‌లో నివసిస్తున్న బొంత శివ మూడు రోజుల క్రితం, వదినె అనసూయ నిండు గర్భిణీ. ఆమెకు నొప్పులు రావడంతో వాహనం కోసం బయటకు వెళ్లాడు. అదే సమయంలో అక్కడ మద్యం సేవించిన 15 మంది.. ఇంత రాత్రి ఇక్కడికి ఎందుకు వచ్చావంటూ శివను నిలదీశారు.

07/26/2018 - 22:53

దొనకొండ, జూలై 26: మండలంలోని తెల్లపాడు గ్రామంలోని పాతరామాలయంలో ఆరు పంచలోహ విగ్రహాలు చోరీకి గురైనట్లు ఎస్సై సుబ్బారావు గురువారం సాయంత్రం పాత్రికేయులకు తెలిపారు. తెల్లపాడు గ్రామానికి శివారులో ఉన్న పాత రామాలయంలో పదిరోజులకోసారి పూజారి పూజలు నిర్వహించేవారు.

07/26/2018 - 21:48

పలాస, జూలై 26: రావివలస సమీపంలోని టెక్కలి ఆదిత్య ఇంజనీరింగ్‌కాలేజికి చెందిన విద్యార్థి హర్షవర్థన్(20) రైల్వేట్రాక్‌పై మృతి చెందడం పట్ల తల్లిదండ్రులు నాగమణి, వెంకటరామప్రసాద్‌లు ఇది ఆత్మహత్య కాదు, హత్య చేసి రైల్వేట్రాక్‌పై పడివేసారని తీవ్ర వేదనతో ఆరోపించారు. పలాస జి ఆర్‌పి పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పలాస ప్రభుత్వాసుపత్రికి బుధవారం రాత్రి తరలించారు.

Pages