క్రైమ్/లీగల్

కోర్టును ధిక్కరించలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 26: కోర్టు ధిక్కారానికి తాము పాల్పడలేదని అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు, న్యాయశాఖ సెక్రటరీ నిరంజన్‌రావు హైకోర్టుకు విన్నవించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్‌ఎ సంపత్‌కుమార్ తమపై పెట్టన ఫిటిషన్‌లను తొలగించలని వారు కోర్టును కోరారు. తమ సభ్యత్వాలను పునరుద్దరించాలని కోర్టు ఆదేశించినప్పటికీ అసెంబ్లీ,న్యాయశాఖ సెక్రటరీలు అమలు చేయలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోర్టును ఆశ్రయించారు. దీంతో అసెంబ్లీ,న్యాయశాఖ సెక్రటరీలు హైకోర్టులో ఫిల్ వేశారు. గురువారం కోర్టులో తమ వాదనలు విరిపించారు. అసెంబ్లీ నిర్ణయాలను తాము అమలు చేస్తామని కోర్టు ధిక్కారణకు తాము పాల్పడలేదని, ఎమ్మెల్యేల సభ్యత్వాల అంశం అసెంబ్లీలో జరిగే సమావేశాల్లో నిర్ణయాలు ఉంటాయని వారు కోర్టుకు తెలిపారు.
స్కూళ్లను ఏం చేస్తున్నారు?
టీచర్ల బదిలీల తర్వాత మూతపడ్డాయని భావిస్తున్న 1800 స్కూళ్లను ఏం చేస్తున్నారో సోమవారం నాటికి చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇటీవల జరిగిన టీచర్ల బదిలీలతో దాదాపు 1800 స్కూళ్లలో ఒక్కరూ టీచర్ లేకపోవడంతో అవి మూతపడ్డాయని పత్రికల్లో వార్తలు వచ్చాయి. ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ టిబిఎన్ రాధాకృష్ణన్, జస్టీస్ వి రామసుబ్రమణియన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఎంవీ ఫౌండేషన్ నేషనల్ కన్వీనర్ ఆర్ వెంకటరెడ్డి దాఖలు చేసిన పిటీషన్‌ను విచారించింది. ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో విద్యార్థుల అభ్యసనపై రెండు తెలుగు రాష్ట్రాలూ దృష్టిసారించాలని హైకోర్టు పేర్కొంది. అభ్యసన ఫలితాలు దారుణంగా ఉంటున్నాయని ఇటీవల వచ్చిన పలు సర్వేలు పేర్కొన్నాయని పిటిషనర్ పేర్కొన్నారు.