క్రైమ్/లీగల్

అన్నవరంలో రెండు లారీలు ఢీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్నవరం, జూలై 26: అన్నవరం శివార్లలోని డిగ్రీ కళాశాల సమీపంలో గురువారం ఉదయం 11.30 గంటల సమయంలో జాతీయ రహదారిపై ఐరన్ లోడుతో వెళుతున్న లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయటంతో వెనుక నుంచి వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. విశాఖపట్టణం నుంచి కత్తిపూడి వైపు ఐరన్ లోడ్‌తో వెళుతున్న లారీ (టిఎన్ 52జె 8247)ని విశాఖ డెయిరీకి చెందిన లారీ (ఏపీ 37టిసి 0949) వెనుక నుంచి వేగంగా ఢీకొట్టడంతో ఆ లారీకి చెందిన డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృతిచెందారు. విజయనగరం జిల్లా రావివలస గ్రామానికి చెందిన డ్రైవర్ పిన్నింటి లక్ష్మీనారాయణ (54), క్లీనర్ పిన్నింటి ఉపేంద్ర (18) మృతిచెందారు. వీరిద్దరూ ఒకే కుటుంబానికి చెందినవారు. వీరితో పాటు ప్రయాణిస్తున్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలై పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో జాతీయ రహదారికి చెందిన అంబులెన్స్‌లో తుని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదుజేసి దర్యాప్తుచేస్తున్నట్టు అన్నవరం ఎస్సై పార్థసారధి తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.