క్రైమ్/లీగల్

ఏసీబీకి చిక్కిన హెడ్ కానిస్టేబుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రొద్దుటూరు, జూలై 26: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలు రావడంతో కడప జిల్లా బ్రహ్మంగారిమఠం పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న చిన్న వీరయ్యను ఏసీబీ అధికారులు గురువారం అరెస్టు చేశారు. ప్రొద్దుటూరు, హైదరాబాద్, బెంగళూరులో అధికారులు ఏకకాలంలో వీరయ్యకు చెందిన ఇళ్లలో సోదాలు నిర్వహించారు. సుమారు రూ.6 కోట్ల విలువచేసే ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ప్రొద్దుటూరులో నాలుగు విలాసవంతమైన భవనాలు, చాపాడు మండలంలో మూడున్నర ఎకరాల భూమిని గుర్తించారు. హైదరాబాద్, బెంగళూరులో సోదాలు కొనసాగుతున్నాయని ఏసీబీ డిఎస్పీ నాగరాజు తెలిపారు. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు ఏకకాలంలో సోదాలు నిర్వహించి రూ.6 కోట్ల విలువ చేసే ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.