S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

07/25/2018 - 21:48

అచ్యుతాపురం, జూలై 25: వరకట్నం వేధింపులే గృహిణి మృతికి కారణంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లై మూడు నెలలకే పచ్చని కాపురంలో చిచ్చురేగి నిండినూరేళ్లు కలసి బ్రతకాలి అనుకున్న గృహిణి కండిపల్లి లక్ష్మి ( 18 ) ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన సంఘటన మండలంలో సంచలనంగా మారింది.

07/26/2018 - 21:18

చెన్నై: మారన్ బ్రదర్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దయానిధి మారన్, కళానిధి మారన్‌లపై, ఇతరులకు వ్యతిరేకంగా కేసు నమోదు చేయాల్సిందిగా మ ద్రాస్ హైకోర్టు సీబీఐని ఆదేశించింది. వీరిని నిర్దోషులుగా ప్రకటిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది. సీబీఐ దాఖలు చేసిన ఫిర్యాదును అనుమతించింది.

07/26/2018 - 21:27

విజయవాడ, జూలై 24: ఆర్టీసీ సిబ్బందికి సుప్రీంకోర్టులో తీవ్ర నిరాశ ఎదురైంది. పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచాలంటూ దాఖలైన మూడు స్పెషల్ లీవ్ పిటిషన్లను మంగళవారం సుప్రీంకోర్టు కొట్టి వేసింది.

07/24/2018 - 04:10

హైదరాబాద్, జూలై 23: శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామిని హైదరాబాద్ నుండి ఆరు నెలల పాటు బషిష్కరిస్తూ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన రికార్డులను మంగళవారం నాడు సమర్పించాలని హైకోర్టు సోమవారం నాడు హోం శాఖ కార్యదర్శిని ఆదేశించింది. మూడు వేర్వేరు పిటీషన్లను విచారించిన జస్టీస్ ఎ రాజశేఖరరెడ్డి ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు.

07/24/2018 - 02:43

భీమవరం, జూలై 23: రాష్టవ్య్రాప్తంగా ప్రసిద్ధిచెందిన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దంతులూరి నారాయణరాజు కళాశాల (డిఎన్నార్ కళాశాల) వివాదంలో చిక్కుకుంది.

07/24/2018 - 02:42

తిరుపతి/గంగాధరనెల్లూరు, జూలై 23: చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలోని శ్రీవారి మెట్టు , గంగాధర నెల్లూరు ప్రాంతాల్లో టాస్క్ఫోర్స్ సిబ్బంది ముగ్గురు ఎర్ర చందనం స్మగ్లర్లను పట్టుకున్నారు. వారి నుంచి ఒక కారు 43 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. శ్రీవారి మెట్టుమార్గంలో టాస్క్ఫోర్స్ సిబ్బంది ఆదివారం రాత్రి కూంబింగ్ చేస్తుండగా మేకల బండ వద్ద ఎర్రచందనం స్మగ్లర్లు తారసపడ్డారు.

07/24/2018 - 02:04

న్యూఢిల్లీ, జూలై 23: దేశ ప్రజల నిరసన వేదికలైన జంతర్‌మంతర్, బోట్స్ క్లబ్‌ల వద్ద వాటిపై పూర్తిస్థాయి నిషేధం ఎంత మాత్రం తగదని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. ఇక్కడ జరిగే నిరసనలు, ర్యాలీలపై కేంద్రం విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది. ఇలాంటి ప్రదేశాల్లో నిరసనలు, ఆందోళనలపై పూర్తిస్థాయి నిషేధం విధించడం తగదని స్పష్టం చేసింది.

07/24/2018 - 02:11

న్యూఢిల్లీ: ఎయిర్‌సెల్-మాక్సిస్ కేసులో మాజీ కేంద్ర మంత్రి పీ చిదంబరానికి తాత్కాలిక ఊరట లభించింది. ఆగస్టు 7 వరకూ ఆయనను అరెస్టు చేయవద్దని సోమవారం పాటియాలా కోర్టు ఆదేశింది. ఎయిర్‌సెల్-మాక్సిస్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఓపీ సైనీ బెయిల్ మంజూరు చేశారు.

07/24/2018 - 00:43

న్యూఢిల్లీ, జూలై 23: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి పరివాహక రాష్ట్రాల సమస్యలను త్వరగా నిర్థారించాలని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. వచ్చే విచారణ నాటి సమస్యలను తేల్చలేని పక్షంలో తామే నిర్ణయం తీసుకొంటామని తెలిపింది. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన సమస్యలను గుర్తించి కేంద్రం ద్వారా కోర్టుకి సమర్పించాలని గతంలో ధర్మాసనం ఆదేశించింది.

07/24/2018 - 00:20

దేవరకొండ, జూలై 23: దైవ దర్శనానికి వెలుతూ బైక్ పై నుండి జారిపడి కనకటి మంజుల (20) అనే మహిళ మృతి చెందిన సంఘటన చందంపేట మండలం ఉస్మాన్‌కుంట వద్ద జరిగింది. చందంపేట మండలం పెద్దమునిగల్ గ్రామానికి చెందిన మంజుల తొలి ఏకాదశి పండుగ సందర్భంగా దేవరచర్ల శివాలయంలో పూజలు చేసేందుకు సోమవారం తన భర్తతో కలిసి ద్విచక్ర వాహనంపై పెద్దమునిగల్ నుండి దేవరచర్లకు బయలు దేరారు.

Pages