క్రైమ్/లీగల్

ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజి విద్యార్థిది హత్యే?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలాస, జూలై 26: రావివలస సమీపంలోని టెక్కలి ఆదిత్య ఇంజనీరింగ్‌కాలేజికి చెందిన విద్యార్థి హర్షవర్థన్(20) రైల్వేట్రాక్‌పై మృతి చెందడం పట్ల తల్లిదండ్రులు నాగమణి, వెంకటరామప్రసాద్‌లు ఇది ఆత్మహత్య కాదు, హత్య చేసి రైల్వేట్రాక్‌పై పడివేసారని తీవ్ర వేదనతో ఆరోపించారు. పలాస జి ఆర్‌పి పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పలాస ప్రభుత్వాసుపత్రికి బుధవారం రాత్రి తరలించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న కుటుంబీకులు, తల్లిదండ్రులు పలాస ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. గురువారం ఉదయం జి ఆర్‌పి పోలీసులు శవపంచానామా నిర్వహించి, పోస్టుమార్టం చేసేందుకు సిద్దపడ్డారు. హర్షవర్థన్ తల్లిదండ్రులు, కుటుంబీకులు మా కుమారుడు ఆత్మహత్యకు పాల్పడే ధైర్యవంతుడు కాదని, రాత్రి సమయాల్లో మూత్ర విసర్జనకు వెళ్లిన ఏవరో సహాయంతో వెళ్లేవాడని, అటువంటి వ్యక్తి ఏ విధంగా ఆత్మహత్య చేసుకుంటాడని పోలీసులను, ఆదిత్య ఇంజనీరింగ్‌కాలేజి సిబ్బందిని నిలదీసారు. ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజి సిబ్బంది ఆసుపత్రికి చేరుకొని జరిగిన సంఘటనపై విచారం వ్యక్తం చేసారు. హర్షవర్థన్‌ను ముందస్తు వ్యూహాంతోనే కాలేజి నుంచి రప్పించి సెల్‌ఫోన్ కాజేసి ఆ సెల్‌ఫోన్ నుంచే ‘ప్రేమకు ఇక సెలవ్’ అంటూ ఒక మేసేజ్ క్రియేట్ చేసి స్టేట్‌స్‌లో ఆ మేసేజ్ పెట్టడంతో సెల్‌ఫోన్‌ల స్నేహితులందరికి ఈ మేసేజ్ పెట్టడం వెనుక హత్యకు ముందస్తు వ్యూహామేనని ఆరోపించారు. ఘటన జీ ఆర్‌పి పోలీసుల పరిధిలో ఉన్నప్పటికి బంధువులతోపాటు పలాసకు చెందిన పలు విద్యార్థి సంఘాల నాయకులు సంఘటన పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ మృతుడు కుటుంబానికి న్యాయం చేయాలని, ఇందుకు కాలేజి యజమాన్యమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి గేటు ముందు బైఠాయించారు. ఈ విషయం తెలుసుకున్న కాశీబుగ్గ డి ఎస్పీ వరప్రసాదరావు ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో పోలీసుబలగాలు చేరుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టిబందోబస్తును ఏర్పాటు చేసారు. శవపంచానామా నిర్వహిస్తుండగా, సీ ఐ వెంకటేశ్వరరావు నిర్థారణ కోసం రైల్వేడ్రైవర్‌ను ఫోన్‌లో సంప్రదించగా, రైల్వేడ్రైవర్ తెలిపిన వివరాలు మేరకు మృతిపై అనుమానాలను బంధువులు వ్యక్తం చేస్తున్నారు. ఒకానొక సమయంలో విద్యార్థి సంఘాలు, కాలేజి యజమాన్యాల మధ్య వాగ్వివాదం జరుగుగా, పరిస్థితి ఉదృతంగా మారే అవకాశం కల్పించినప్పటికి పోలీసులు శాంతింపజేసారు. అప్పటి వరకు మృతుడు హర్షవర్థన్ తోటి స్నేహితులను మాట్లాడించేందుకు కాలేజి యజమాన్యం నిరాకరించడంతో విద్యార్థి సంఘాల డిమాండ్ మేరకు ఎట్టకేలకు తోటి విద్యార్థులు కాలేజిలో ఎటువంటి సంఘటనలు జరగలేదని, బుధవారం రాత్రి వరకు మాతో ఉన్నాడని తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహంతో బంధువులు పలాస జీడిపప్పుబొమ్మ వద్ద బైఠాయించి న్యాయం చేయాలంటూ నినాదాలు చేయగా, పోలీసు బలగాలు వారిని అక్కడ నుంచి పంపివేసారు.

హత్యకు ప్రేమే కారణమా!?
హర్షవర్థన్ మృతి వెనుక ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రేమే కారణమని గుసగుసలాడుకోవడం వినిపిస్తున్నాయి. అమ్మాయికి సంబంధించిన వ్యక్తులు హర్షవర్థన్‌కు బెదిరింపులకు పాల్పడినట్లు విశ్వసనీయసమాచారం. ఈ నేపథ్యంలో మృతికి ప్రేమే కారణమేనని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజి వద్ద బందోబస్తు
హర్షవర్థన్ మృతి చెందడంతో మృతదేహంతో బంధువులు గొడవకు దిగే అవకాశాలు ఉన్నాయని భావించి గురువారం మధ్యాహ్నాం కాలేజి వద్ద పోలీసుల బలగాలు మోహరించి బందోబస్తును ఏర్పాటు చేసారు. హర్షవర్థన్ మృతదేహాన్ని కాలేజిలోకి తీసుకువెళ్లడానికి బంధువులు ప్రయత్నించినప్పటికి పోలీసులు హైవే నుంచి పంపివేసారు. ఈ విషయాన్ని తెలుసుకున్న సీ ఐ శ్రీనివాసరావు కాలేజిలోకి వెళ్లి హర్షవర్థన్ రూమ్‌తోపాటు తోటి స్నేహితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.