S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

07/31/2018 - 23:40

భీమ్‌గల్, జూలై 31: భీమ్‌గల్ మండలంలోన కారేపల్లి గ్రామ రేషన్ డీలర్, మండల జడ్పీటీసీ భర్త శర్మనాయక్ ఆటోరిక్షాలో అక్రమంగా తరలిస్తుండగా సోమవారం రాత్రి గ్రామస్థులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ వెంకటేశం కథనం మేరకు సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

07/31/2018 - 23:34

మాడుగుల, జూలై 31: గిరిజన ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతానికి ఆటోలో గంజాయి తరలిస్తున్న నలుగురిని మాడుగుల ఎక్సైజ్ సిబ్బంది మంగళవారం పట్టుకుని వారి నుంచి 74 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయితో పట్టుబడిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. మండలంలోని తాటిపర్తి గ్రామ సమీపాన వాహనాలు తనిఖీ చేస్తుండగా గంజాయి పట్టుబడినట్టు స్థానిక ఎక్సైజ్ సి.ఐ. టి.నాగేశ్వరరావు చెప్పారు.

07/31/2018 - 23:27

జియ్యమ్మవలస, జూలై 31: మండలంలో ఇటిక గదబవలస గిరిజన గ్రామానికి చెందిన కోనా రవికుమార్(32) అనుమానాస్పదంగా సోమవారం రాత్రి మృతిచెందాడు. స్థానికులు, పోలీసులు అందించిన వివరాలమేరకు రవికుమార్ గౌరీపురం గ్రామంలో ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి పనులను ముగించుకుని ఇంటికి రాకపోవడంతో అతని కుటుంబ సభ్యులు ఆందోళనలు చెంది వెతకడం ప్రారంభించారు.

07/31/2018 - 23:11

ఒంగోలు, జూలై 31: ఈ ఏడాది జూన్ నెల క్రైమ్ బులెటిన్‌ను ఎస్‌పి బి సత్య ఏసుబాబు మంగళవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో విడుదల చేశారు.

07/31/2018 - 22:54

కూసుమంచి, జూలై 31: వృద్ధురాలి దగ్గర ఉన్న డబ్బులు ఇవ్వలేదని కుమారుడి కొడుకు ఇల్లు తగలబెట్టిన ఘటన మండలంలోని జీళ్ళచెరువు గ్రామంలో చోటు చేసుకుంది. బాధితురాలి కధనం ప్రకారం ముద్రబోయిన లక్ష్మికి ముగ్గురు కుమారులు వున్నా వారెవ్వరూ ఆమె బాగోగులు చూసుకోకపోవడంతో వృద్ధ దంపతులు ఇద్దరు అదే వీధిలో ఒక గుడిసెలో నివాసం ఉంటున్నారు.

07/31/2018 - 22:51

సత్తెనపల్లి, జూలై 31: ముప్పాళ్ళ మండలంలోని నార్నెపాడు గ్రామానికి వెళ్తూ మార్గంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. లోడ్ లారీ అదుపుతప్పి నార్నెపాడు కాల్వలో బోల్తా పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముఠా కార్మికుడు మామిడి దుర్గారావు (40) మృతిచెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించారు.

07/31/2018 - 22:50

నూజెండ్ల, జూలై 31: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన వి అప్పాపురం గ్రామ సమీపంలో మంగళవారం జరిగింది. గ్రామానికి చెందిన నక్కా చంద్రారెడ్డి (30) నూ జెండ్లకు పనుల నిమిత్తం ద్విచక్రవాహనంపై వెళ్లాడు. పనులు ముగించుకుని స్వగ్రామమైన అప్పాపురం వెళ్తున్న సమయంలో మార్గమద్యలోని ఎన్‌ఎస్పీ కెనాల్ ఫెన్సింగ్ రాళ్లను ద్విచక్రవాహనం అదుపుతప్పి డీ కొట్టాడు. ఈ ప్రమాదంలో చంద్రారెడ్డికి తీవ్రగాయాలయ్యాయి.

07/31/2018 - 22:34

చెనే్నకొత్తపల్లి, జూలై 31 : కడుపునొప్పి తాళ లేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని ముష్టికోవెల గ్రామంలో మంగళవారం జరిగింది. ఏఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన నీల్ల చంద్రకళ (30) గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఉండేది. అయితే మంగళవారం మధ్యాహ్నం ఇంటిలో ఉన్న సమయంలో కడుపునొప్పి అధికమైంది.

07/31/2018 - 00:27

కేపీహెచ్‌బీకాలనీ: రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో మృతి చెందిన సంఘటన కేపీహెచ్‌బీ పొలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులకథనం ప్రకారం గుడివాడకు చెందిన శంకర్ అనే వ్యక్తి మద్యం సేవించి కేపీహెచ్‌బీ కాలనీ రోడ్డు నంబర్ 1 వద్ద రోడ్డు దాటుతుండగా వేగంగా దూసుకువచ్చిన ఆర్టీసీ బస్సు అతనిని ఢీ కొట్టింది. దీంతో శంకర్ అక్కడికక్కడే మృతిచెందాడు.

07/30/2018 - 23:43

మచిలీపట్నం, జూలై 30: తల్లీ కూతుళ్లపై యాసిడ్‌తో దాడి చేసిన కేసులో నిందితుడైన షేక్ సుభానికి యావజ్జీవ కారాగార శిక్ష (జీవిత ఖైదు), లక్ష రూపాయలు జరిమానా విధిస్తూ తొమ్మిదవ అదనపు జిల్లా జడ్జి ఎస్‌ఎస్‌ఎస్ జయరావు సోమవారం తీర్పు చెప్పారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Pages