క్రైమ్/లీగల్

మెట్టింటి వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొణిజర్ల, జూలై 26: భర్త, అత్తమామల వేధింపులు తాళ్ళలేక ఓ వివాహిత ఆత్మహత్యకు ప్రయత్నించిన సంఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన మండల పరిధిలోని కొండమాల గ్రామంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కొప్పుల చంటికి తల్లాడ మండల కేంద్రానికి చెందిన కవితతో గత ఏడాది నవంబర్ నెలలో వివాహం జరిగింది. వివాహం సందర్భంగా రెండు లక్షల రూపాయలను కట్నంగా అందచేశారు. రెండు నెలలు అన్యోన్యంగా ఉన్న భర్త చంటి మరో మహిళతో వివాహేతసంబధం ఏర్పరుచుకొని, అదనంగా కట్నం తీసుకురమ్మని, పిల్లలు లేరని రకరకాల కారణాలతో తరచూ ఘర్షణ పడుతూ మానసికంగా, శారీకంగా వేధించేవాడని మృతురాలి రావేలు, సోదరుడు నీలంరాజు తెలిపారు. గతంలో అనేక సార్లు కొట్టాడని, నాలుగు నెలల క్రితం కడుపుపై తన్నటంతో అబార్షన్ అయ్యిందని విలపిస్తూ చెప్పింది. బుధవారం ఉదయం భర్తతోపాటు అత్త సుశీల, మామ జ్ఞానయ్యలు ఇంట్లో తలుపులు వేసి విపరీతంగా కొట్టారు. దీంతో మనస్థాపానికి గురైన కవిత పురుగు మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడటంతో చికిత్స కోసం ఖమ్మం తరలించగా చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందినట్లు వెల్లడించారు. సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఉసురు తీసిన రుణభారం
కొణిజర్ల, జూలై 26: సాగుకోసం చేసిన రుణభారం ఓ పోడుసాగు రైతు ఉసురు తీసింది. పంటల పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీరేదారి లేక రైతు ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన మండల పరిధిలోని తుమ్మలపల్లి శివారు అన్నవరం గ్రామంలో గురువారం ఆలస్యంగా వెలుగు చూసింది. మృతుని కుటుంబీకులు, స్థానికులు తెలిపిన ప్రకారం గ్రామానికి చెందిన పసుపులేటి నాగయ్య(70) తనకున్న 10 ఎకరాల పోడు భూమిలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ప్రతి ఏడాది పత్తి, మిర్చి, మొక్కజొన్న పంటలను పండిస్తున్నాడు. పెట్టుబడి కోసం బంధువులు, ఇతరుల వద్ద లక్షలాది రూపాయలు అప్పులు చేశాడు. గత ఏడాది సాగుచేసిన మిర్చిపంట సరైన దిగుబడి రాలేదు. దీనికి తోడు గిట్టుబాటు ధరలేకపోవటంతో గత కొద్దిరోజులుగా తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు. ఈ నేపధ్యంలో బుధవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరులేని సమయంలో లుంగీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కూతురు ఖమ్మం నుంచి ఇంటికి వచ్చి తలుపుతీసి చూసేసరికి తండ్రి ఫ్యాన్‌కు వేలాడుతూ కన్పించాడు. మృతునికి భార్యతోపాటు ఏడుగురు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు వీరాంజనేయులు ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని రైతు సంఘం రాష్ట్ర నాయకుడు బొంతు రాంబాబు, బిఎల్‌ఎఫ్ నియోజకవర్గ కన్వీనర్ భూక్యా వీరభద్రం, సిపిఎం మండల కార్యదర్శి తాళ్ళపల్లి కృష్ణ, ఎన్‌డి నాయకులు పొట్లపల్లి శ్రీశైలం, రైతుకూలీ సంఘం జిల్లా నాయకుడు షేక్ ఖాసీం, పిడిఎస్‌యు జిల్లా అధ్యక్షురాలు కె స్వప్న తదితరులు సందర్శించి నివాళ్ళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలే రైతుల ఆత్మహత్యలకు కారణమని ఆరోపించారు. మృతుని కుంబానికి వెంటనే ఎక్ష్సిగ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.