S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/13/2019 - 16:56

న్యూఢిల్లీ: దిశ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. అమ్మాయిల పట్ల గౌరవంగా నడుచుకుంటామని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో అబ్బాయిల చేత టీచర్లు ప్రతిజ్ఞ చేయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

12/13/2019 - 16:56

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టంపై ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని శక్తులు హింసను ప్రేరేపింజేస్తున్నాయని క్రీడలు, యువజనల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ చట్టంపై ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. అక్కడి ప్రజలకు భావోద్వేగాలు అధికం అని అన్నారు. వారికి సరైన అవగాహన కల్పిస్తే ఈ చట్టంతో అన్ని వర్గాల ప్రజలకు రక్షణగా ఉంటుందని అన్నారు.

12/13/2019 - 16:55

న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు నేటితో ముగిశాయి. ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ సమావేశాల్లో వివాదాస్పదమైన పౌరసత్వ సవరణ బిల్లు, చిట్‌ఫండ్ (సవరణ), ఎస్పీజీ బిల్లులు ఆమోదించారు. కాగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన రేప్ ఇన్ ఇండియా వాఖ్యలపై ఉభయ సభల్లోని మహిళా ఎంపీలు మండిపడ్డారు.

12/13/2019 - 13:42

బెంగళూరు: ఛాతీ నొప్పితో గత రాత్రి ఓ ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్యను కర్నాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప పరామర్శించారు. ఈ సందర్భంగా యడియూరప్ప వెంట రాష్ట్ర మంత్రులు కేఎస్ ఈశ్వరప్ప, బసవరాజ బొమ్మై తదితరులు కూడా ఉన్నారు.

12/13/2019 - 13:40

న్యూఢిల్లీ:2001లో పార్లమెంటుపై జరిగిన ఉగ్రదాడిలో మృతిచెందిన అమర జవాన్లకు పార్లమెంట్‌ ఆవరణలోని స్మారక స్థూపం వద్ద రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ తదితరులు నివాళులర్పించారు. హోంశాఖ మంత్రి అమిత్‌షా, మాజీ ప్రధాని మన్మోహన్‌, కాంగ్రెస్‌ నేత గులాంనబీ ఆజాద్‌తోపాటు పలువురు నేతలు అమరజవాన్లకు నివాళులర్పించారు.

12/13/2019 - 13:18

చెన్నై: తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. ఆన్‌లైన్ లాటరీ వ్యామోహనికి ఒక కుటుంబం బలైంది. విల్లుపురం సమీపంలోని సలామత్‌నగర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యుల స్వర్ణకార కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ముగ్గురు కుమార్తెలకు విషమిచ్చి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు అరుణ్, శివగామి, ప్రియదర్శిని(5), యువశ్రీ(3), భారతి(నాలుగు నెలలు)గా గుర్తించారు.

12/13/2019 - 13:16

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంటులో అధికార పార్టీ మహిళా ఎంపీలు ఆగ్రహాం వ్యక్తం చేశారు. దేశంలో జరుగుతున్న అత్యాచార ఘటనలపై రాహుల్ ఓ సభలో మాట్లాడుతూ మేకిన్ ఇండియా అత్యాచారాల రాజధానిగా మారిందని విమర్శించారు.

12/13/2019 - 13:15

జమ్మూకశ్మీర్: భారత్‌లోకి అక్రమంగా చొరబడ్డ దుండగులను బీఎస్‌ఎఫ్ జవాన్లు కాల్చిచంపారు. సాంబా సెక్టార్‌లో మంగుచాక్ చెక్‌పోస్టు బీఎస్‌ఎప్ దళాలు కాల్పులు జరిపి దుండగులను కాల్చి చంపాయి. కాగా ఎంతమంది చొరబడ్డారనే వివరాలు ఇంకా వెల్లడికాలేదు.

12/13/2019 - 13:14

న్యూఢిల్లీ: పౌరసత్వ బిల్లు చట్టంగా మారింది. ఈ మేరకు గురువారం సాయంత్రం రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ దీనిపై ఆమోద ముద్ర వేశారు. ఆ వెంటనే కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ గెజిట్ విడుదల చేసింది. కాగా ఈశాన్య రాష్ట్రాల్లో ఈ బిల్లుపై తీవ్ర నిరసనలు వ్యక్తం అవతున్నాయి. ముఖ్యంగా అస్సాంలో హింసాత్మక ఘటనలు సైతం చోటుచేసుకుంటున్నాయి.

12/13/2019 - 05:23

న్యూఢిల్లీ: రహదార్ల నిర్మాణంలో తొలగిస్తున్న వృక్షాల స్థానంలో కొత్త చెట్ల పెంపకాన్ని చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం లోక్‌సభలో స్పష్టం చేశారు. జాతీయ రహదారుల నిర్మాణాన్ని నిర్దేశిత కాల వ్యవధిలోగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం వివిధ స్థాయిల్లో ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందన్నారు.

Pages