S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/09/2016 - 11:59

విశాఖ: ఆస్తి తగాదాల ఫలితంగా ఓ కుమార్తె తల్లిదండ్రులను హత్య చేసేందుకు ప్రయత్నించిన ఘటన ఇక్కడి శ్రీహరిపురం నెహ్రూనగర్‌లో జరిగింది. భర్త సహకారంతో ఆమె తన కన్నతండ్రి తలపై బండరాయితో గట్టిగా మోది హత్య చేసింది. కుమార్తె, అల్లుడు జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడిన తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

02/09/2016 - 11:59

విజయవాడ: కాపు గర్జన సందర్భంగా గత నెల 31న రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌తోపాటు రెండు పోలీసుస్టేషన్లను, పలు వాహనాలను దగ్ధం చేసిన ఘటనలో పోలీసులకు కీలక సమాచారం లభించినట్లు తెలిసింది. రత్నాచల్‌పై దాడి చేసిన వారి ఫొటోలను పోలీసులు సేకరించారు. వాటి ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు.

02/09/2016 - 11:58

కర్నూలు: నగరంలోని ఆనంద్ థియేటర్ సమీపంలో మంగళవారం ఉదయం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు మురుగు కాల్వలను శుభ్రం చేస్తుండగా నాలుగు ఆడశిశువుల మృతదేహాలు బయటపడ్డాయి. దీంతో మృతదేహాలను చూసేందుకు స్థానికులు భారీ సంఖ్యలో వచ్చారు. ఈ ఉదంతంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

02/09/2016 - 11:57

చిత్తూరు: తిరుపతి సమీపంలోని శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీల కోసం టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం ఉదయం నుంచీ కూంబింగ్ నిర్వహిస్తున్నారు. కొంతమంది ఎర్రచందనం కూలీలు తారసపడటంతో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. దీంతో భయపడిన కూలీలు పరారయ్యారు. పెద్ద మొత్తంలో ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

02/09/2016 - 11:57

విజయవాడ: ఇక్కడి గుణదల మేరీమాత ఉత్సవాలు మంగళవారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు.

02/09/2016 - 11:55

గుంటూరు: వివాదాలకు నిలయంగా మారిన ఇక్కడి నాగార్జున యూనివర్సిటీలో ఓ విద్యార్థిని స్నానం చేస్తుండగా ఓ విద్యార్థి రహస్యంగా సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన ఘటన సంచలనం రేపింది. ఆ విద్యార్థిని కేకలు వేయడంతో నిందితుడు శ్రీకర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఇండస్ట్రియల్ టూర్‌కు హైదరాబాద్ నుంచి వచ్చిన విద్యార్థిని నాగార్జున విశ్వవిద్యాలయంలో బస చేయగా, ఈ ఘటన జరిగింది.

02/09/2016 - 05:16

కాకినాడ, ఫిబ్రవరి 8: మంజునాథ కమిషన్ నివేదిక ఆధారంగా కాపులను బీసీల్లో చేర్చాలని అసెంబ్లీ తీర్మానంచేసి, పార్లమెంటుకు పంపిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాళ్లు కడుగుతానని మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. గత నాలుగు రోజులుగా చేస్తున్న దీక్ష విరమణ సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాపు సోదరుల ఆకలి కేకల కారణంగానే తాను రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

02/09/2016 - 05:13

విజయవాడ: ఆంధ్ర పర్యాటకరంగ సిగలో మరో కలికితురాయి వచ్చి చేరనుంది. యుద్ధనౌక ఐఎన్‌ఎస్ విరాట్‌ను రాష్ట్రానికి అప్పగించేందుకు భారత నావికాదళం అంగీకరించినట్టు సిఎం చంద్రబాబు ప్రకటించారు. విరాట్‌రాకతో పర్యాటకులను మరింతగా ఆకట్టుకోవచ్చని అన్నారు. యుద్ధనౌకగా నావికా రంగానికి ఇన్నాళ్లూ సేవలందించిన విరాట్, ఇక ఏపీ పర్యాటక రంగానికి ప్రధాన ఆకర్షణగా మారనుంది.

02/09/2016 - 01:08

కాకినాడ: రాష్ట్ర ప్రభుత్వ దౌత్యం ఫలించడంతో కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దంపతులు సోమవారం మధ్యాహ్నం ఆమరణ నిరాహార దీక్ష విరమించారు. ఉత్కంఠ భరిత వాతావరణంలో జరిగిన చర్చల అనంతరం ముద్రగడ దంపతులకు ఏపీ తెదేపా అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావు, కార్మిక మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నిమ్మరసమిచ్చి, దీక్ష విరమింపజేశారు.

02/09/2016 - 01:05

తుని: కాపుల ఉద్యమం కారణంగా వారంపాటు ప్రయాణికులకు దూరమైన రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ ఎట్టకేలకు పట్టాలెక్కింది. సోమవారం నుంచి విశాఖపట్నం- విజయవాడ రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ (నెం.12717) ప్రయాణం మొదలైంది. గతనెల 31న తూర్పు గోదావరి జిల్లా తునివద్ద కాపు ఐక్యగర్జన సందర్భంగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పుపెట్టిన సంగతి తెలిసిందే.

Pages