ఆంధ్రప్రదేశ్‌

మరోసారి దీక్ష చేసే పరిస్థితి తేవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఫిబ్రవరి 8: మంజునాథ కమిషన్ నివేదిక ఆధారంగా కాపులను బీసీల్లో చేర్చాలని అసెంబ్లీ తీర్మానంచేసి, పార్లమెంటుకు పంపిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాళ్లు కడుగుతానని మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. గత నాలుగు రోజులుగా చేస్తున్న దీక్ష విరమణ సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాపు సోదరుల ఆకలి కేకల కారణంగానే తాను రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గత 20 ఏళ్లుగా కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని మూలనపెట్టిన తమలో ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీతోనే మళ్లీ ఆశలు చిగురించాయన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలనే తాము అమలుచేయామని కోరామన్నారు. కాపులకు కల్పించే రిజర్వేషన్లు కేవలం పేదలకు కల్పిస్తే సరిపోతుందన్నారు. అందువల్ల ముందుగానే క్రీమీలేయర్ విధానం అమలుచేసినా తమకు అభ్యంతరం లేదన్నారు. అలాగే ప్రస్తుతం బీసీ సోదరులకున్న రిజర్వేషన్లకు ఎటువంటి నష్టం కలగని రీతిలో మిగిలిన 50 శాతంలో తమకు కొంత రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలను నిలుపుకోవాలని, తనకు వయసు పెరుగుతోందని, మరోసారి తాను రోడ్డెక్కి, దీక్ష చేసే పరిస్థితి తీసుకురావద్దని కోరారు. ఉద్యమం సందర్భంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తే క్షమించాలని చంద్రబాబుకు విజ్ఞప్తిచేశారు. ప్రభుత్వ ప్రతినిధులతో జరిగిన చర్చల అనంతరం చిన్న చిన్న అభ్యంతరాలున్నప్పటికీ కాపు జాతికోసం తాను ఆమరణ నిరాహార దీక్ష విరమించుకుంటున్నట్టు ముద్రగడ చెప్పారు. ఉద్యమ సమయంలో తనకు సంఘీభావం తెలిపిన, సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
కాగా ముద్రగడ దీక్ష విరమించే సమయంలో అంతటా ఉత్కంఠభరిత వాతావరణం ఏర్పడింది. దీక్ష విరమించినట్టు తెలియగానే అప్పటికపుడు సాయుధ దళాలు బందోబస్తును సడలించాయి. అప్పటికే పెద్ద ఎత్తున సమీప ప్రాంతాల నుండి చేరుకున్న జనం ఒక్కసారిగా ముద్రగడ నివాసానికి హర్షద్వానాలు చేస్తూ తరలివచ్చారు. జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్ సత్యనారాయణ, ఎస్పీ ఎం రవిప్రకాష్, అదనపు ఎస్పీ దామోదర్ తదితరులు ఘటనాస్థలిని పర్యవేక్షించారు.