ఆంధ్రప్రదేశ్‌

పర్యాటకంలో విరాట్‌పర్వం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఆంధ్ర పర్యాటకరంగ సిగలో మరో కలికితురాయి వచ్చి చేరనుంది. యుద్ధనౌక ఐఎన్‌ఎస్ విరాట్‌ను రాష్ట్రానికి అప్పగించేందుకు భారత నావికాదళం అంగీకరించినట్టు సిఎం చంద్రబాబు ప్రకటించారు. విరాట్‌రాకతో పర్యాటకులను మరింతగా ఆకట్టుకోవచ్చని అన్నారు. యుద్ధనౌకగా నావికా రంగానికి ఇన్నాళ్లూ సేవలందించిన విరాట్, ఇక ఏపీ పర్యాటక రంగానికి ప్రధాన ఆకర్షణగా మారనుంది. దీనిలో 500లకు పైగావున్న గదులను పర్యాటకులకు అత్యంత ఆధునిక సౌకర్యాలతో అందుబాటులోకి తేనున్నారు. దీనిపై హెలికాప్టర్ దిగే అవకాశం కూడా ఉందని చంద్రబాబు తెలిపారు. సోమవారం విజయవాడలోని తన కార్యాలయంలో టూరిజం అధికారులతో సమీక్ష జరిపారు. పర్యాటక శాఖ కుదుర్చుకున్న ఎంవోయూల ప్రస్తుత స్థితి, కొత్త ప్రాజెక్ట్ రిపోర్టులపై చర్చించారు. టూరిజం వృద్ధి పరుగులు పెట్టాలంటే పనులు వేగవంతం చేయాలని, సేవలు విస్తృతపర్చాలని పర్యాటక అధికారులను ఆదేశించారు. ఇస్తాంబుల్ స్ఫూర్తితో రాష్ట్ర ఆతిథ్య రంగాన్ని అత్యున్నతంగా తీర్చిదిద్దాలని కోరారు. సముద్రతీరాన్ని వినియోగించుకుంటే పర్యాటక రంగంలో ఆశించిన స్థాయికి చేరడం అసాధ్యం కాదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో స్టార్ రేటింగ్‌వున్న హోటల్ గదులు 664 ఉన్నాయని, మరో 2609 గదులు నిర్మాణ దశలో ఉన్నాయని టూరిజం అధికారులు సిఎంకు వివరించారు. వచ్చే ఏడాది మార్చిలోగా వైజాగ్, విజయవాడ, తిరుపతి సహా రాష్ట్రంలో స్టార్ రేటింగ్ హోదా కలిగిన 15వేల హోటల్ గదుల లభ్యతవుండేలా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. స్టార్ రేటింగ్‌లేని రూమ్‌లకు ప్రమాణాలు పెంచేలా ప్రయత్నిస్తున్నామన్నారు. అనేక ప్రైవేట్ సంస్థలు హోటళ్ల నిర్మాణానికి ముందుకొస్తున్నాయని, స్పిరిచ్యువల్, వాటర్ స్పోర్ట్స్, అడ్వెంచర్ స్పోర్ట్స్‌లో పలువురు ఆసక్తి చూపుతున్నారని సిఎంకు వివరించారు. పర్యాటక రంగంలో రూ.10వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని, 88 ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయని, మరో 15 ప్రారంభం కావాల్సి ఉందన్నారు. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంలో కొత్తగా రూ.2,705 కోట్ల విలువైన 46 ప్రాజెక్టులు వస్తున్నాయని తెలిపారు. రూ.11,466 కోట్ల వ్యయంతో మొత్తం 154 ప్రాజెక్టులు ప్రైవేట్ రంగంలో వస్తున్నాయని, 32,922 మందికి ఉపాధి లభించనుందని చెప్పారు.
రాష్ట్ర జిఎస్‌డిపిలో టూరిజం వాటా గత ఏడాదితో పోలిస్తే ఈసారి మూడు త్రైమాసికాలకు కలిపి 6.5 శాతం పెరిగిందని టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ నీరబ్‌కుమార్ ప్రసాద్ వివరించారు. రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందన్నారు. రాష్ట్రానికి దేశీయ పర్యాటకుల రాక గత ఏడాది 30.3 శాతం పెరగ్గా, విదేశీ పర్యాటకుల సంఖ్య అనూహ్యంగా పెరిగిందన్నారు. గత ఏడాది 2లక్షల 37వేల మంది విదేశీ పర్యాటకులు రాష్ట్రానికి వచ్చారన్నారు. అంతర్జాతీయ అతిథుల్ని ఆకర్షించడమే పరమావధిగా పెట్టుకుని ప్రణాళికలు అమలు చేస్తున్నామని చెప్పారు.
కాగా, విశాఖలో నిర్వహించిన ఫ్లీట్ రివ్యూ సూపర్ సక్సెస్ అయిందని, 50 దేశాల వారు పాల్గొనడం, 6లక్షల మంది స్వయంగా వచ్చి ప్రదర్శనలు తిలకించడం చరిత్రలో ఇంతవరకు జరగలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. 2011లో ముంబైలో జరిగిన ఫ్లీట్ రివ్యూలో 20 దేశాలు మాత్రమే పాల్గొన్నాయన్నారు. అంతర్జాతీయ ఫ్లీట్‌లో 50 దేశాల గౌరవ వందనాన్ని ఒకే వేదిక పైనుంచి రాష్టప్రతి, ప్రధాని అందుకోటం చారిత్రక ఘటన అని వర్ణించారు. ప్రస్తుతం నిర్మితమైన జెట్టీని ప్రజల సందర్శన కోసం ఉంచుతామన్నారు. ఇదే స్ఫూర్తితో పర్యాటక శాఖ విభిన్న తరహా ఫెస్టివల్స్ నిర్వహించి పర్యాటకుల్ని ఆకర్షించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రి నారాయణ, టూరిజం కార్పొరేషన్ ఎండీ వి ప్రేమ్‌చంద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.