S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/13/2016 - 02:30

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 12: రాష్ట్రప్రభుత్వం రకరకాల కసరత్తులు చేసి అమలుచేస్తున్న కొత్త ఇసుక విధానంలోని డొల్లతనం బయపడుతోంది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో కొత్త విధానంలో ఇసుక రీచ్‌ల వేలం ప్రారంభమైన నేపథ్యంలో ఈ లోపాలు వెలుగుచూస్తున్నట్టు తెలుస్తోంది.

02/13/2016 - 02:29

కడప, ఫిబ్రవరి 12: కడప జిల్లా ఇసుక టెండర్లలో అధికార, ప్రతిపక్ష నాయకులు సిండికేట్‌గా మారి కొన్నిరీచ్‌లను ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే అధిక ధరలకు కోట్‌చేస్తూ టెండర్లు దక్కించుకోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే కొన్నిచోట్ల ఎక్కువ ధరకు కోట్‌చేయగా, మరికొన్ని చోట్ల అతి తక్కువ ధరకు టెండర్లు వేసి రీచ్‌లను దక్కించుకున్నారు.

02/12/2016 - 19:24

శ్రీకాకుళం: ఎచ్చెర్ల మండలం చిలకపాలెంలో ఈరోజు ఏపీ ఎన్జీవోల 19వ మహాసభలు ప్రారంభమయ్యాయి. ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రులు అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్‌ హాజరయ్యారు.

02/12/2016 - 12:57

ఏలూరు: వివిధ స్కీమ్‌ల కింద వేలాది కోట్ల డిపాజిట్లు వసూలు చేసి ఖాతాదారులను వంచించిన కేసులో అగ్రిగోల్డ్ చైర్మన్ ఎ.వి.రామారావు, ఎం.డి. ఎ.వి.ఎస్.నారాయణరావులకు 14 రోజుల పాటు రిమాండు విధిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.గురువారం వారిని అరెస్టు చేసిన సీఐడీ పోలీసులు శుక్రవారం ఏలూరులోని న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు.

02/12/2016 - 12:55

కర్నూలు: తాము ప్రేమికులకు వ్యతిరేకం కాదని వీహెచ్‌పీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు సాయిరెడ్డి చెప్పారు. వాలెంటైన్స్‌డే రోజున ప్రేమికులు కనిపిస్తే వారికి పెళ్లి చేస్తామని అన్నారు.

02/12/2016 - 11:57

ఏలూరు: వివిధ స్కీమ్‌ల కింద వేలాది కోట్ల డిపాజిట్లు వసూలు చేసి ఖాతాదారులను వంచించిన కేసులో అగ్రిగోల్డ్ చైర్మన్ ఎ.వి.రామారావు, ఎం.డి. ఎ.వి.ఎస్.నారాయణరావులను సిఐడి అధికారులు శుక్రవారం ఉదయం ఇక్కడి రెండో అదనపు ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ వద్ద హాజరుపరిచారు. గురువారం రాత్రి ఈ ఇద్దరినీ అరెస్టు చేశాక, పోలీసు అతిథి గృహంలో ఉంచి వివరాలు రాబట్టారు.

02/12/2016 - 11:56

విజయవాడ: కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గంగూరు వద్ద శుక్రవారం ఉదయం ఓ ప్రైవేటు స్కూలు బస్సు రోడ్డు పక్కన ఆగి వున్న రోడ్డు రోలర్‌ను ఢీకొనడంతో 20 మంది విద్యార్థులు గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కొందరికి కాళ్లు చేతులు విరిగాయని, ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.

02/12/2016 - 04:13

హైదరాబాద్: తెలంగాణలో పోయిన పరువును కాపాడుకునేందుకు ఆంధ్రాలో ఆపరేషన్ ఆకర్ష్‌కు టిడిపి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా వైకాపా ఎమ్మెల్యేలను టిడిపిలో చేర్చుకునేందుకు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఫలించ లేదు సరికదా బెడిసి కొట్టాయి. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో టిడిపి చిత్తుగా ఓడిపోవడం, ఎమ్మెల్యేలు వరుసపెట్టి టిఆర్‌ఎస్‌లో చేరడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నివ్వెర పోతున్నారు.

02/12/2016 - 04:04

విజయవాడ: గత ఏడాదిగా సంచలనం కలిగిస్తున్న అగ్రిగోల్డ్ వ్యవహారం కొలిక్కి వస్తోంది. వేలాది బాధితులను డిపాజిట్లు, స్థలాలు, వివిధ రూపాల్లో మోసగించారనే అభియోగంపై తొలుత ప్రధానంగా ఏలూరులో నమోదైన కేసుల ఆధారంగా సిఐడి రంగంలోకి ప్రవేశించింది. అగ్రిగోల్డ్ ఆస్తులన్నింటిని జప్తు చేసి బాధితులకు పంచాలంటూ హైకోర్టు సైతం ఆదేశాలు జారీ చేసింది. అయినా ఇందులో అంతులేని జాప్యం జరుగుతోందంటూ ఇటీవల హైకోర్టు మందలించింది.

02/11/2016 - 12:04

విజయవాడ: విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైకాపా ఎమ్మెల్యే గురువారం ఉదయం ఎ.పి. సి.ఎం. చంద్రబాబును కలవడం చర్చనీయాంశమైంది. మంత్రి దేవినేని ఉమతో కలిసి ఆయన సి.ఎం. నివాసానికి చేరుకొని చర్చలు జరిపినట్టు తెలిసింది. జలీల్ టిడిపిలో చేరతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Pages