S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/09/2016 - 00:50

అగ్రవర్ణాలతో కలిసి విజయవాడ కేంద్రంగా పెద్దఎత్తున ఉద్యమాలు
కృష్ణయ్య, గంగాధర్ నాయకత్వంలో నేడు వేర్వేరుగా విస్తృత సమావేశాలు

02/08/2016 - 14:59

కాకినాడ: ప్రభుత్వ దూతలు ఇచ్చిన హామీలతో తాను దీక్ష విరమించానని, కాపులు మళ్లీ రోడ్కెక్కితే ఆ బాధ్యత సిఎం చంద్రబాబుదేనని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అన్నారు. ఆయన సోమవారం మధ్యాహ్నం ఆమరణ దీక్ష విరమించిన అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ, గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాపులకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుంటే మళ్లీ ఉద్యమిస్తాన్నారు.

02/08/2016 - 14:08

కాకినాడ: కాపు కులస్థులను బీసీ జాబితాలో చేర్చాలని గత నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సోమవారం మధ్యాహ్నం దీక్ష విరమించారు. ఎపి ప్రభుత్వం తరఫున దూతలుగా హాజరైన టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కె.కళా వెంకట్రావు, మంత్రి అచ్చెన్నాయుడు, టిడిపి నేతలు తోట త్రిమూర్తులు, బి.్భస్కర రామారావు తదితరులు ముద్రగడతో సుమారు గంటన్నరసేపు చర్చలు జరిపారు.

02/08/2016 - 12:39

రాజమండ్రి: ఆమరణ దీక్ష చేస్తున్న కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను పరామర్శించేందుకు వెళుతున్న కాంగ్రెస్ నాయకులు చిరంజీవి, పళ్లంరాజు, వట్టి వసంతకుమార్, సి.రామచంద్రయ్యలను సోమవారం రాజమండ్రి (మధురపూడి) ఎయిర్‌పోర్టులో పోలీసులు నిర్బంధించారు. నిషేధాజ్ఞల కారణంగా వీరు కిర్లంపూడికి వెళ్లరాదని పోలీసులు తేల్చిచెప్పారు.

02/08/2016 - 12:10

విశాఖ: జి.మాడుగుల మండలం సంగంబంద వద్ద సోమవారం ఉదయం పోలీసులు తనిఖీలు చేసి 4 కోట్ల విలువచేసే మూడు టన్నుల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన ఏడుగురు నిందితుల్లో తమిళనాడుకు చెందిన ఐదుగురు స్మగ్లర్లు ఉన్నారు.

02/08/2016 - 12:09

రాజమండ్రి: కిర్లంపూడిలో ఆమరణ దీక్ష చేస్తున్న కాపు నేత ముద్రగడ పద్మనాభంను పరామర్శించేందుకు వెళ్తున్న తనను పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారని, మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణరావు ఆరోపించారు. రాజమండ్రిలోని ఓ హోటల్‌లో తాను ఉండాలని, ఎక్కడికీ వెళ్లడానికి వీలులేదని పోలీసు అధికారులు ఆదేశించారనీ, ఇంతకీ తాను దేశ పౌరుడినా? లేక ఉగ్రవాదినా? అని ప్రశ్నించారు. కాపుల రిజర్వేషన్ సమస్యను ఎ.పి.

02/08/2016 - 12:08

విజయవాడ: ఎ.పి. సి.ఎం. చంద్రబాబు ఈ రోజు మధ్యాహ్నం దిల్లీ చేరుకొని కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ, రైల్వే మంత్రి సురేష్ ప్రభుతో చర్చలు జరుపుతారు. మరి కొద్దిరోజుల్లో వార్షిక బడ్జెట్, రైల్వే బడ్జెట్‌లను కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న దృష్ట్యా రాష్ట్రానికి తగినన్ని ప్రాజెక్టులు సాధించేందుకు బాబు దిల్లీ యాత్ర చేపట్టారు.

02/08/2016 - 12:07

శ్రీకాకుళం: మహోదయ ఘడియలు ప్రారంభం కావటంతో శ్రీకాకుళం జిల్లా బారువ వద్ద మహేంద్రతనయ నది సముద్రంలో కలిసే చోట సోమవారం ఉదయం పుణ్యస్నానాలు ప్రారంభమయ్యాయి. దాదాపు 33 ఏళ్ల తర్వాత ఈ పుణ్య ఘడియలు రావడంతో బారువ తీరానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తారు. ఇచ్ఛాపురం ఎమ్మెల్యే అశోక్, ఆర్డీవో వెంకటేశ్వరరావు నదికి హారతిచ్చి పుణ్యస్నానాల కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

02/08/2016 - 12:07

కాకినాడ: కాపులను బిసి రిజర్వేషన్ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఆమరణ దీక్ష సోమవారం నాలుగో రోజుకు చేరుకుంది. ఉదయం 9 గంటలకు వైద్య పరీక్షలు చేసేందుకు వచ్చిన డాక్టర్లను ఆయన అనుమతించలేదు. తలుపులు మూసుకొని ముద్రగడ దీక్ష చేస్తుండటంతో డాక్టర్లు లోనికి వెళ్లలేక పోయారు.

02/08/2016 - 12:06

విజయవాడ: విశాఖ-విజయవాడ మధ్య కొద్దిరోజుల విరామం అనంతరం రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ సోమవారం ఉదయం 6.10 ని.లకు బయల్దేరింది. ఈ రైలుకు తుని రైల్వేస్టేషన్‌లో ప్రయాణీకులు ఘనంగా స్వాగతం పలికారు. గతవారం దగ్ధమైన బోగీలకు సంబంధించిన ప్లెక్సీలను కొత్తరైలుకు ప్రయాణీకులు కట్టారు. రైళ్లను దగ్ధం చేస్తే ఇబ్బందిపడేది ప్రజలేనని వారు నినాదాలు చేశారు.

Pages