S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/06/2016 - 11:52

గుంటూరు: మగశిశువు పుట్టిందని ముందు చెప్పి, ఆ తర్వాత ఆడశిశువును అప్పగించటంపై ఓ మహిళ బంధువులు ఆందోళన ప్రారంభించిన సంఘటన గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం జరిగింది. కొల్లిపర మండలం పిడపర్రు గ్రామానికి చెందిన ఓ గర్భిణి ఈ ఆస్పత్రిలో ప్రసవించింది. ఐతే మగశిశువు పుట్టిందని తొలుత చెప్పిన ఆస్పత్రి సిబ్బంది, ఆ తర్వాత తల్లికి ఆడశిశువును అప్పగించారు.

02/06/2016 - 11:51

తిరుపతి: ఇక్కడి పద్మావతి విశ్వవిద్యాలయానికి సమీపంలోని రైల్వే ట్రాక్‌పై శనివారం ఉదయం ప్రేమికుల మృతదేహాలు లభించాయి. వీరు ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఎవరైనా హత్యచేసి పట్టాలపై పడేశారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుల వయసు పాతికేళ్లు ఉంటాయని పోలీసులు చెబుతున్నారు.

02/06/2016 - 11:50

కాకినాడ: కాపులను బిసి జాబితాలో చేర్చాలన్న డిమాండ్‌తో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ఆయన భార్య పద్మావతి కిర్లంపూడిలోని తమ ఇంట్లో ప్రారంభించిన ఆమరణ దీక్ష శనివారం రెండో రోజుకు చేరింది. ప్రతి మూడు గంటలకోసారి వైద్యులు వీరికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. చక్కెర నిల్వలు పడిపోయాయని, ఫలితంగా కొంత నీరసం వచ్చినట్లు వైద్యులు తెలిపారు.

02/06/2016 - 01:54

విజయవాడ, ఫిబ్రవరి 5: ప్రభుత్వం కాపుల పట్ల సానుకూలంగా వున్నా, కాపుల రిజర్వేషన్ల కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నా... ముద్రగడ పద్మనాభం దీక్ష ఎందుకు చేస్తున్నారో ప్రజలకు వివరించాలని మంత్రి నారాయణ అన్నారు. కిర్లంపూడిలో ఆయన చేస్తున్న ఆమరణ దీక్ష వల్ల ఒనగూరే ప్రయోజనం ఏమీ వుండదని, అనవసరంగా ప్రభుత్వం మీద బురదజల్లడం, కాపుల్లో గందరగోళం సృష్టించడం మాత్రమే ఆయన అజెండాగా కన్పిస్తోందని అన్నారు.

02/06/2016 - 01:54

తిరుమల,్ఫబ్రవరి 5: శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు టిటిడి కల్పిస్తున్న సౌకార్యాలలో పారదర్శకతను పెంచేందుకు చేపడుతున్న సంస్కరణల్లో భాగంగా 300 రూపాయల ప్రత్యేక దర్శన టిక్కెట్లను మొబైల్ యాప్‌తో అందించేదిశగా టిటిడి యాజమాన్యం యోచిస్తోంది.

02/06/2016 - 01:53

విశాఖపట్నం, ఫిబ్రవరి 5: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో 1000 పడకల సామర్థ్యం కలిగిన అధునాతన ఆసుపత్రితో పాటు వైద్య, నర్శింగ్ కళాశాలల నిర్మాణానికి భారత్ - యుకె (యునైటెడ్ కింగ్‌డమ్) సంస్థ మధ్య ఒప్పందం కుదిరింది.

02/06/2016 - 01:52

ఏలూరు, ఫిబ్రవరి 5: సిడి ఫైలు పంపించడానికి లంచం స్వీకరిస్తూ ఏసిబికి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన ఎస్సైకి మూడేళ్ల కఠిన కారాగారశిక్ష, లక్ష రూపాయలు జరిమానా విధిస్తూ విజయవాడ ఎసిబి కోర్టు శుక్రవారం తీర్పుచెప్పింది.

02/06/2016 - 01:52

వజ్రకరూరు, ఫిబ్రవరి 5: సుధీర్ఘకాలం పాటు శిక్షణకే పరిమితమైన అనంతపురం జిల్లా వజ్రకరూరులోని వజ్రముల ప్రక్రమణ కర్మాగారం (డైమండ్ ప్రాసెసింగ్ ప్లాంట్)లో శుక్రవారం నుంచి పరిశోధనలు ప్రారంభమయ్యాయి. 300 టన్నుల ముడిసరుకుతో పరిశోధనలు ప్రారంభించారు. దేశంలోని ఏకైక వజ్రముల ప్రక్రమణ కేంద్రం అనంతపురం జిల్లా వజ్రకరూరులో ఉంది.

02/06/2016 - 01:51

కూచిపూడి, ఫిబ్రవరి 5: నవ్యాంధ్ర రాజధాని పరిధిలోని విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ ఒడిలో ఐదవ అంతర్జాతీయ కూచిపూడి నాట్య మహా సమ్మేళనం నిర్వహించేందుకు సన్నాహాలు చేపట్టనున్నట్లు సిలికానాంధ్ర వ్యవస్థాపక చైర్మన్ కూచిభొట్ల ఆనంద్ శుక్రవారం ఈ విలేఖరికి తెలిపారు. కూచిపూడి నాట్యానికి విశ్వ వ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలన్న ఆశయంతో సిలికానాంధ్ర అమెరికాలోని సిలికాన్ వ్యాలిలో 2008వ సంవత్సరంలో పద్మభూషణ్ డా.

02/06/2016 - 01:51

విశాఖపట్నం, ఫిబ్రవరి 5: రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని విధాల తాను ప్రయత్నిస్తుంటే, మరోపక్క కొన్ని దుష్టశక్తులు కుటిల రాజకీయాలు చేస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

Pages